ప్రియురాలిని హత్య చేసిన కేసులో విచారణ ఎదుర్కొంటున్న దక్షిణాఫ్రికా అథ్లెట్ ఆస్కార్ పిస్టోరియస్ రాజీ మార్గంలో పడ్డాడు.
జొహన్నెస్‌బర్గ్: ప్రియురాలిని హత్య చేసిన కేసులో విచారణ ఎదుర్కొంటున్న దక్షిణాఫ్రికా అథ్లెట్ ఆస్కార్ పిస్టోరియస్ రాజీ మార్గంలో పడ్డాడు. మోడల్ రీవా స్టీన్‌కాంప్‌ను తన సొంత ఫ్లాట్‌లో కాల్చి చంపిన కేసులో ఈ అథ్లెట్ ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నాడు. సోమవారం ఇతడిపై పోలీసులు హత్యా నేరం మోపారు. వచ్చే ఏడాది మార్చి 3న విచారణ ప్రారంభం కానుంది. అయితే అంతలోపే రీవా తల్లిదండ్రులతో కోర్టు బయట రాజీ కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు.
తన లాయర్ ద్వారా ఇప్పటికే వారితో ఒప్పందం కుదుర్చుకునేందుకు చర్చలు జరుపుతున్నాడు. స్టీన్‌కాంప్ కుటుంబ లాయర్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. అయితే వివరాలు వెల్లడించలేదు. మరోవైపు స్టీన్‌కాంప్, ఆమె సోదరుడి ఆదాయం మీదే తల్లిదండ్రులు జీవితం కొనసాగిస్తుండగా, ఇప్పుడు తమ కూతురు చనిపోవడంతో నష్టపరిహారం కింద 3 లక్షల డాలర్లకు సివిల్ వ్యాజ్యం వేసే ఆలోచనలో ఆమె తల్లిదండ్రులు ఉన్నారు.