pistorius
-
పిస్టోరియస్ చేసింది హత్యే..
గత తీర్పును మార్చిన సుప్రీం కోర్టు 15 ఏళ్లు జైలుశిక్ష పడే అవకాశం బ్లూమ్‌ఫోంటేన్: దక్షిణాఫ్రికా బ్లేడ్ రన్నర్ ఆస్కార్ పిస్టోరియస్ ఉద్దేశపూర్వకంగానే తన ప్రియురాలు రీవా స్టీన్‌కాంప్‌ను హత్య చేసినట్టుగా ఆ దేశ సుప్రీం కోర్టు తేల్చింది. అనాలోచిత చర్యగా భావించి గతంలో అతడికి స్థానిక కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. బాత్రూమ్లో తలుపు వెనకాల స్టీన్కాంప్ కానీ ఆగంతకుడు కానీ ఎవరున్నా తుపాకీతో కాల్చితే కచ్చితంగా మరణిస్తారని పిస్టోరియస్కు తెలుసని జడ్జి అభిప్రాయపడ్డారు. గతంలో ఇచ్చిన తీర్పు దోషపూరితంగా ఉందని, అతడికి కఠిన శిక్ష వేయాల్సిందేనని స్పష్టం చేస్తూ కేసును ట్రయల్ కోర్టుకు తిప్పి పంపింది. దీంతో ఈ అథ్లెట్‌కు 15 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి. 2013 ఫిబ్రవరి 14న పొరపాటుగా బాత్రూమ్లో ఆ గంతకుడు దూరాడనుకుని కాలిస్తే తన ప్రియురాలు మరణించిందని అప్పట్లో ఆస్కార్ కోర్టుకు తెలిపారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఏడాది శిక్షా కాలం పూర్తి చేసుకున్న తను అక్టోబర్‌లో పెరోల్‌పై విడుదలై గృహ నిర్భందంలో ఉండేందుకు కోర్టు అనుమతించింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఆస్కార్‌కు కఠిన శిక్ష పడలేదని గట్టిగా నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో కేసు ను సుప్రీం కోర్టు తిరిగి విచారించింది. తాజా తీర్పు తో స్టీవ్కాంప్ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. -
బ్లేడ్ రన్నర్ పిస్టోరియస్కు 15 ఏళ్లు జైలు
ప్రిటోరియా: ప్రియురాలి హత్య కేసులో దక్షిణాఫ్రికా బ్లేడ్ రన్నర్ ఆస్కార్ పిస్టోరియస్కు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. శుక్రవారం ఈ కేసును విచారించిన దక్షిణాఫ్రికా హైకోర్టు ఈ మేరకు తుదితీర్పు వెలువరించింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 2013 లో పిస్టోరియస్ తన ప్రియురాలు రీవా స్టెన్ క్యాంప్‌ను హత్య చేసినట్టు అభియోగాలు నమోదైన సంగతి తెలిసిందే. అయితే తనపై వచ్చిన హత్యా ఆరోపణలను పిస్టోరియస్ ఖండించారు. తన గదిలోకి గుర్తు తెలియన వ్యక్తి దూరడంతో అతనిపై కాల్పులు జరిపానని, అనుకోకుండా స్టెన్ క్యాంప్ కు తగిలిందని పిస్టోరియస్ కోర్టు విచారణలో వెల్లడించారు. ఈ కేసును గురువారం విచారించిన న్యాయస్థానం పిస్టోరియన్ ముందస్తు ప్రణాళిక ప్రకారం ఆమెను హత్య చేయలేదంటూ పేర్కొంది. అయితే ఓ వ్యక్తి మరణానికి కారణమైనందున తక్కువ తీవ్రత కలిగిన హోమిసైడ్ కేసును ఈ రోజు విచారించింది. పిస్టోరియస్ ఉద్దేశపూర్వకంగా ప్రియురాలిని చంపలేదని, అయితే హత్య చేసింది అతనేనని పేర్కొంది. పిస్టోరియస్కు శిక్ష విధిస్తూ ఆదేశాలు జారీచేసింది. -
నిజ జీవితంలోనూ అంతే వేగంగా.. వెనక్కి!
-
రాజీకి దక్షిణాఫ్రికా అథ్లెట్ పిస్టోరియస్ ప్రయత్నం
జొహన్నెస్‌బర్గ్: ప్రియురాలిని హత్య చేసిన కేసులో విచారణ ఎదుర్కొంటున్న దక్షిణాఫ్రికా అథ్లెట్ ఆస్కార్ పిస్టోరియస్ రాజీ మార్గంలో పడ్డాడు. మోడల్ రీవా స్టీన్‌కాంప్‌ను తన సొంత ఫ్లాట్‌లో కాల్చి చంపిన కేసులో ఈ అథ్లెట్ ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నాడు. సోమవారం ఇతడిపై పోలీసులు హత్యా నేరం మోపారు. వచ్చే ఏడాది మార్చి 3న విచారణ ప్రారంభం కానుంది. అయితే అంతలోపే రీవా తల్లిదండ్రులతో కోర్టు బయట రాజీ కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. తన లాయర్ ద్వారా ఇప్పటికే వారితో ఒప్పందం కుదుర్చుకునేందుకు చర్చలు జరుపుతున్నాడు. స్టీన్కాంప్ కుటుంబ లాయర్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. అయితే వివరాలు వెల్లడించలేదు. మరోవైపు స్టీన్కాంప్, ఆమె సోదరుడి ఆదాయం మీదే తల్లిదండ్రులు జీవితం కొనసాగిస్తుండగా, ఇప్పుడు తమ కూతురు చనిపోవడంతో నష్టపరిహారం కింద 3 లక్షల డాలర్లకు సివిల్ వ్యాజ్యం వేసే ఆలోచనలో ఆమె తల్లిదండ్రులు ఉన్నారు.