బ్లేడ్ రన్నర్ పిస్టోరియస్కు 15 ఏళ్లు జైలు | Judge finds Pistorius guilty of culpable homicide | Sakshi
Sakshi News home page

బ్లేడ్ రన్నర్ పిస్టోరియస్కు 15 ఏళ్లు జైలు

Sep 12 2014 2:03 PM | Updated on Apr 3 2019 3:50 PM

ప్రియురాలి హత్య కేసులో దక్షిణాఫ్రికా బ్లేడ్ రన్నర్ ఆస్కార్ పిస్టోరియస్కు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

ప్రిటోరియా: ప్రియురాలి హత్య కేసులో దక్షిణాఫ్రికా బ్లేడ్ రన్నర్ ఆస్కార్ పిస్టోరియస్కు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. శుక్రవారం ఈ కేసును విచారించిన దక్షిణాఫ్రికా హైకోర్టు ఈ మేరకు తుదితీర్పు వెలువరించింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

2013 లో  పిస్టోరియస్ తన ప్రియురాలు రీవా స్టెన్ క్యాంప్ను హత్య చేసినట్టు అభియోగాలు నమోదైన సంగతి తెలిసిందే. అయితే తనపై వచ్చిన హత్యా ఆరోపణలను పిస్టోరియస్ ఖండించారు. తన గదిలోకి గుర్తు తెలియన వ్యక్తి దూరడంతో అతనిపై కాల్పులు జరిపానని, అనుకోకుండా స్టెన్ క్యాంప్ కు తగిలిందని పిస్టోరియస్ కోర్టు విచారణలో వెల్లడించారు.  ఈ కేసును గురువారం విచారించిన న్యాయస్థానం పిస్టోరియన్ ముందస్తు ప్రణాళిక ప్రకారం ఆమెను హత్య చేయలేదంటూ పేర్కొంది.  అయితే ఓ వ్యక్తి మరణానికి కారణమైనందున తక్కువ తీవ్రత కలిగిన హోమిసైడ్ కేసును ఈ రోజు విచారించింది. పిస్టోరియస్ ఉద్దేశపూర్వకంగా ప్రియురాలిని చంపలేదని, అయితే హత్య చేసింది అతనేనని పేర్కొంది. పిస్టోరియస్కు శిక్ష విధిస్తూ ఆదేశాలు జారీచేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement