భారత్‌కు తొలి విజయం | Opening for Women India | Sakshi
Sakshi News home page

భారత్‌కు తొలి విజయం

Nov 27 2014 12:41 AM | Updated on Sep 2 2017 5:10 PM

భారత్‌కు తొలి విజయం

భారత్‌కు తొలి విజయం

తొలి వన్డేలో ఓడిపోయిన భారత మహిళల జట్టు రెండో వన్డేలో తేరుకుంది. దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన రెండో మ్యాచ్‌లో మిథాలీ రాజ్ బృందం....

రాణించిన శిఖా, పూనమ్

 బెంగళూరు: తొలి వన్డేలో ఓడిపోయిన భారత మహిళల జట్టు రెండో వన్డేలో తేరుకుంది. దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన రెండో మ్యాచ్‌లో మిథాలీ రాజ్ బృందం ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. సిరీస్‌లోని చివరిదైన మూడో వన్డే  శుక్రవారం జరుగుతుంది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 186 పరుగులు చేసింది.

చోలె ట్రయాన్ (34 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌తో 49) టాప్ స్కోరర్‌గా నిలిచింది. భారత బౌలర్లలో శిఖా పాండే (3/19), ఏక్తా బిస్త్ (3/28) రాణించారు. 187 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత్ 44.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి అధిగమించింది. ఓపెనర్ పూనమ్ రౌత్ (77 బంతుల్లో 8 ఫోర్లతో 47), శిఖా పాండే (56 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్‌తో 57) నిలకడగా ఆడి భారత విజయంలో ముఖ్యపాత్ర పోషించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement