
గోల్డ్‌కోస్ట్: కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొంటున్న తొలి లింగ మార్పిడి వెయిట్‌లిఫ్టర్ లారెల్ హబ్బర్డ్ భుజం గాయంతో పోటీ నుంచి మధ్యలో తప్పుకుంది. న్యూజిలాండ్‌కు చెందిన ఈ 40 ఏళ్ల లిఫ్టర్ మహిళల ప్లస్ 90 కేజీల కేటగిరీలో పాల్గొనేందుకు సిద్ధమైంది. స్నాచ్‌లో మూడో ప్రయత్నం సందర్భంగా ఆమె తడబడి విఫలమైంది. బార్‌ను ఎత్తే ప్రయత్నంలో గాయపడ్డ ఆమె కంటతడి పెట్టుకొని పోటీ నుంచి వైదొలిగింది. లారెల్ మొదట పురుషుడు. పేరు గెవిన్ హబ్బర్డ్. పదేళ్ల క్రితం 30 సంవత్సరాల వయసులో లింగమార్పిడి చేయించుకొని అతను ఆమెగా మారాడు.
వెయిట్‌లిఫ్టింగ్ అంటే ఎంతో ఇష్టమైన హబ్బర్డ్ కామన్వెల్త్ కోసం ఎంతో పట్టుదలగా సన్నద్ధమైంది. అయితే ఇతర దేశాలకు చెందిన లిఫ్టర్లు, కోచ్‌లు ఆమె ఇప్పుడు మహిళగా మారినప్పటికీ పూర్వమున్న పురుషుల బలం అంతర్గతంగా ఉండనే ఉంటుందని విమర్శించారు. హబ్బర్డ్‌ను మహిళల ఈవెంట్‌లో పాల్గొనేందుకు అనుమతించడం సహేతుకం కాదని సమోవా లిఫ్టింగ్ జట్టు హెడ్ కోచ్ జెర్రీ వాల్‌వర్క్ నిర్వాహకుల తీరును తప్పుబట్టారు. అయితే తాను మాత్రం ఇలాంటి విమర్శలను పట్టించుకోనని లారెల్ హబ్బర్డ్ చెప్పింది.