క్వార్టర్ ఫైనల్లో నైనా


సాక్షి, హైదరాబాద్: జాతీయ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాదీ క్రీడాకారిణి నైనా జైస్వాల్ యూత్ బాలికల విభాగంలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గుజరాత్‌లోని కచ్ జిల్లాలో జరుగుతున్న ఈ టోర్నమెంట్‌లో ఆమె... హైదరాబాద్‌కే చెందిన మేటి ర్యాంకింగ్ క్రీడాకారిణి నిఖత్‌బానుపై సంచలన విజయం సాధించింది.

 

 

 గుజరాత్ టీటీ సమాఖ్యతో కలిసి కచ్ జిల్లా టీటీ సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఈవెంట్‌లో గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో నైనా జైస్వాల్ 12-10, 9-11, 11-7, 11-8, 5-11, 11-8తో నిఖత్ బానును కంగుతినిపించింది. ఈ విజయంపై కోచ్‌లు సందీప్ గుప్తా, జ్యోతి షా, తోపాన్ చంద్ర, అరుల్ సెల్వీ నైనాను ప్రశంసించారు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top