
అఫ్ఘాన్ మరో సంచలనం
అఫ్ఘానిస్తాన్ వన్డే జట్టు మరో సంచలనం సృష్టించింది. వరుసగా రెండోసారి జింబాబ్వేపై సిరీస్ విజయం సాధించింది.
జింబాబ్వేపై రెండోసారి సిరీస్ విజయం
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్-10లోకి ప్రవేశం
షార్జా: అఫ్ఘానిస్తాన్ వన్డే జట్టు మరో సంచలనం సృష్టించింది. వరుసగా రెండోసారి జింబాబ్వేపై సిరీస్ విజయం సాధించింది. ఫలితంగా తొలిసారి ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్-10లో స్థానం దక్కించుకుంది. బుధవారం జరిగిన చివరి వన్డేలో విజయం ద్వారా జింబాబ్వేతో సిరీస్‌ను అఫ్ఘాన్ జట్టు 3-2తో చేజిక్కించుకుంది. తొలుత జింబాబ్వే 49.5 ఓవర్లలో 248 పరుగులు చేసింది. మసకద్జ (111 బంతుల్లో 110; 9 ఫోర్లు; 4 సిక్సర్లు) సెంచరీ చేశాడు. హమ్జాకు మూడు వికెట్లు దక్కాయి. అఫ్ఘానిస్తాన్ 49.4 ఓవర్లలో 8 వికెట్లకు 254 పరుగులు చేసి గెలిచింది. గుల్బదిన్ నబీ (68 బంతుల్లో 82 నాటౌట్; 3 ఫోర్లు; 6 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. శుక్రవారం నుంచి ఇరు జట్ల మధ్య రెండు టి20ల సిరీస్ ప్రారంభమవుతుంది.