‘టీఎన్‌పీఎల్‌’లో మురళీధరన్‌ | muttiah muralitharan in tnpl | Sakshi
Sakshi News home page

‘టీఎన్‌పీఎల్‌’లో మురళీధరన్‌

May 26 2017 10:34 AM | Updated on Sep 5 2017 12:03 PM

‘టీఎన్‌పీఎల్‌’లో మురళీధరన్‌

‘టీఎన్‌పీఎల్‌’లో మురళీధరన్‌

ఐపీఎల్‌ సహా ప్రపంచ వ్యాప్తంగా వేర్వేరు లీగ్‌లలో భాగంగా ఉన్న దిగ్గజ స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌ దిగువ స్థాయి క్లబ్‌ జట్టుకు మెంటార్‌గా వ్యవహరించేందుకు సిద్ధమయ్యారు.

చెన్నై: ఐపీఎల్‌ సహా ప్రపంచ వ్యాప్తంగా వేర్వేరు లీగ్‌లలో భాగంగా ఉన్న దిగ్గజ స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌ దిగువ స్థాయి క్లబ్‌ జట్టుకు మెంటార్‌గా వ్యవహరించేందుకు సిద్ధమయ్యారు. తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌ (టీఎన్‌పీఎల్‌)లో ఒక జట్టుకు మెంటార్‌గా వ్యవహరించడానికి అంగీకారం తెలిపారు.

 

మాజీ భారత క్రికెటర్‌ వీబీ చంద్రశేఖర్‌కు చెందిన తిరువళ్లూర్‌ వీరన్స్‌ జట్టుకు మురళీ తన అనుభవాన్ని పంచనున్నారు. జులైలో జరిగే ఈ లీగ్‌లో అన్ని మ్యాచ్‌లకు ఆయన అందుబాటులో ఉంటారని జట్టు యజమాని చంద్రశేఖర్‌ తెలిపారు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు బౌలింగ్‌ కోచ్‌గా ఉన్న మురళీ, ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు స్పిన్‌ కన్సల్టెంట్‌గా పనిచేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement