మన్‌ప్రీత్‌కు స్వర్ణం | Manpreet to gold medal | Sakshi
Sakshi News home page

మన్‌ప్రీత్‌కు స్వర్ణం

Apr 25 2017 1:44 AM | Updated on Sep 5 2017 9:35 AM

ఆసియా గ్రాండ్‌ప్రి అథ్లెటిక్స్‌ మీట్‌లో భారత క్రీడాకారులు మెరిశారు.

జిన్‌హువా (చైనా): ఆసియా గ్రాండ్‌ప్రి అథ్లెటిక్స్‌ మీట్‌లో భారత క్రీడాకారులు మెరిశారు. మహిళల షాట్‌పుట్‌లో మన్‌ప్రీత్‌ కౌర్‌ ఇనుప గుండును 18.86 మీటర్ల దూరం విసిరి కొత్త జాతీయ రికార్డు నెలకొల్పడంతోపాటు స్వర్ణ పతకాన్ని సాధించింది.

నీరజ్‌ చోప్రా (జావెలిన్‌ త్రో), టింటూ లుకా (మహిళల 800 మీటర్లు), నీనా (లాంగ్‌జంప్‌), జిన్సన్‌ జాన్సన్‌ (పురుషుల 800 మీటర్లు) రజత పతకాలు సాధించగా... ద్యుతీ చంద్‌ (మహిళల 100 మీటర్లు), ఓం ప్రకాశ్‌ (పురుషుల షాట్‌పుట్‌) కాంస్య పతకాలు గెలిచారు.

Advertisement
 
Advertisement
Advertisement