లియోనల్‌ మెస్సీపై నిషేధం! | Lionel Messi Banned For Three Months | Sakshi
Sakshi News home page

లియోనల్‌ మెస్సీపై నిషేధం!

Aug 3 2019 12:53 PM | Updated on Aug 3 2019 12:53 PM

Lionel Messi Banned For Three Months - Sakshi

బ్యూనోస్‌ ఎయిర్స్‌: అర్జెంటీనా ఫుట్‌బాల్‌ స్టార్‌ ఆటగాడు లియోనల్‌ మెస్సీపై మూడు నెలల నిషేధం విధించారు. దక్షిణ అమెరికా ఫుట్‌బాల్‌ గవర్నింగ్‌ బాడీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంతో మెస్సీపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జూన్‌-జూలై నెలల్లో బ్రెజిల్‌ వేదికగా జరిగిన కోపా అమెరికా కప్‌లో భాగంగా దక్షిణ అమెరికా ఫుట్‌బాల్‌ గవర్నింగ్‌ బాడీపై మెస్సీ విమర్శలకు దిగాడు. ఈ కప్‌లో బ్రెజిల్‌ విజేతగా నిలిచేందుకు సదరు గవర్నింగ్‌ బాడీ అవినీతికి పాల్పడిందంటూ విమర్శలు గుప్పించాడు. అంతకుముందు కూడా మెస్సీ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతో దీన్ని తీవ్రంగా పరిగణించిన దక్షిణ అమెరికా ఫుట్‌బాల్‌ గవర్నింగ్‌ బాడీ మూడు నెలల పాటు నిషేధం విధించింది. అదే సమయంలో యాభై వేల అమెరికన్‌ డాలర్లు జరిమానా విధించింది.

కోపా అమెరికా కప్‌లో అర్జెంటీనా మూడో స్థానంతో సరిపెట్టుకుంది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా 2-1 తేడాతో చిలీని ఓడించింది. అంతకుముందు బ్రెజిల్‌తో జరిగిన సెమీ ఫైనల్లో అర్జెంటీనా 0-2 తేడాతో ఓటమి పాలైంది. ఫైనల్లో బ్రెజిల్‌ 3-1 తేడాతో పెరూపై గెలిచి విజేతగా నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement