రొనాల్డోను చూసే అలా చేశా: కేఎల్‌ రాహుల్‌

KL Rahul Reveals Behind HIs New celebration style - Sakshi

మాంచెస్టర్‌ : ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా స్టార్‌ ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ అజేయ సెంచరీతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ సెంచరీ అనంతరం ఓ ప్రత్యేకమైన స్టైల్‌తో కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్‌ విరాట్‌తో కలిసి మైదానంలో సెలబ్రేట్‌ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ స్టైల్‌ నెటిజన్లను వీపరీతంగా ఆకట్టుకుంటోంది. అయితే మ్యాచ్‌ అనంతరం భారత క్రికెటర్‌ దినేశ్‌ కార్తీక్‌, కేఎల్ రాహుల్‌ను సరదాగా ఇంటర్వ్యూ చేశాడు. రెండేళ్ల తర్వాత సాధించిన ఈ సెంచరీ తనకెంతో ప్రత్యేకమైనదని ఈ సందర్భంగా రాహుల్‌ చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్‌ తన కాన్ఫిడెన్స్‌ లెవల్స్‌ను రెట్టింపు చేసిందని, ఆ ఉత్సాహంతోనే రాణించానని తెలిపాడు. ఇక సెంచరీ అనంతరం సెలెబ్రేషన్‌పై స్పందిస్తూ.. తన ఫెవరేట్‌ ఫుట్‌బాల్‌ ఆటగాడు పోర్చ్‌గల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో స్టైలేనే తాను విరాట్‌ అనుకరించామని తెలిపాడు. విరాట్‌ కూడా రోనాల్డో పెద్ద అభిమాని అని తెలిసిందే కదా అని కార్తీక్‌తో అన్నాడు. ఈ సిరీస్‌ ముగిసే లోపు భారత ఆటగాళ్లందరికి ఈ స్టైల్‌ నేర్పిస్తానని ఈ కర్ణాటక ఆటగాడు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతానికి హార్ధిక్‌ పాండ్యా, కోహ్లిలు నేర్చుకున్నారని చెప్పాడు. ఇక ఈ మ్యాచ్‌లో భారత్‌ 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top