ఫైనల్లో శ్రీకాంత్ | Kidambi Srikanth sails into Australian Open Super Series final | Sakshi
Sakshi News home page

ఫైనల్లో శ్రీకాంత్

Jun 24 2017 10:43 AM | Updated on Sep 5 2017 2:22 PM

ఫైనల్లో శ్రీకాంత్

ఫైనల్లో శ్రీకాంత్

ఇటీవల ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ ను సాధించి మంచి ఊపు మీద ఉన్న భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్.. ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో సైతం ఫైనల్లోకి ప్రవేశించాడు.

సిడ్నీ:ఇటీవల ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ ను సాధించి మంచి ఊపు మీద ఉన్న భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్.. ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో సైతం ఫైనల్లోకి ప్రవేశించాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్లో శ్రీకాంత్ 21-10, 21-14 తేడాతో షి యుకి(చైనా)పై గెలిచి తుదిపోరుకు అర్హత సాధించాడు.

 

ఏకపక్షంగా సాగిన రెండు గేమ్ల్లో శ్రీకాంత్ ఆద్యంత నిలకడను ప్రదర్శించాడు. తొలి గేమ్ ను అవలీలగా గెలిచిన శ్రీకాంత్.. రెండో గేమ్ లో కాస్త కష్ట పడ్డాడు.  ఓవరాల్ గా 40 నిమిషాల్లోపే మ్యాచ్ ను ముగించిన శ్రీకాంత్ సగర్వంగా ఫైనల్ కు చేరాడు. తద్వారా వరుసగా మూడో టోర్నీలో ఫైనల్ కు చేరాడు. అంతకముందు సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్, ఇండోనేసియా ఓపెన్లో శ్రీకాంత్ ఫైనల్ కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement