'ఏస్'లతో సరికొత్త రికార్డు! | Ivo Karlovic Hits 61 Aces that Record of New US Open | Sakshi
Sakshi News home page

'ఏస్'లతో సరికొత్త రికార్డు!

Aug 31 2016 4:00 PM | Updated on Sep 4 2017 11:44 AM

'ఏస్'లతో సరికొత్త రికార్డు!

'ఏస్'లతో సరికొత్త రికార్డు!

యూఎస్ ఓపెన్ లో భాగంగా క్రొయేషియా టెన్నిస్ స్టార్ ఇవో కార్లోవిక్ తన పదునైన సర్వీస్ తో రికార్డు సృష్టించాడు.

యూఎస్ ఓపెన్ లో భాగంగా క్రొయేషియా టెన్నిస్ స్టార్ ఇవో కార్లోవిక్ తన పదునైన సర్వీస్ తో రికార్డు సృష్టించాడు. మంగళవారం రాత్రి జరిగిన తొలిరౌండ్లో ప్రత్యర్థిపై ఏకంగా రికార్డు స్థాయిలో 61 ఏస్ లు సంధించి గతంలో ఉన్న 49 ఏస్'ల రికార్డు తిరగరాశాడు. తైవాన్ ప్లేయర్ లు యెన్సన్ పై 4-6, 7-6 (7/4), 6-7 (4/7), 7-6 (7/5), 7-5 తేడాతో నెగ్గి కార్లోవిక్ రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. ఆరడుగుల పదకొండు అంగులాల ఎత్తుండే ఈ ఆటగాడు ప్రత్యర్థిపై నెగ్గేందుకు ఏస్ లను తన అమ్ములపొదిలో ప్రధాన అస్త్రంగా మార్చుకున్నాడు.

తొలి సెట్ ప్రత్యర్థిగా కోల్పోయిన తాను ముఖ్యంగా చెప్పాలంటే రెండో సెట్లో దాదాపు నేను ఆడిన షాట్లలో ఎక్కువగా ఏస్ ఉన్నాయని ఐదు సెట్ల సుదీర్ఘ మ్యాచ్ ముగిసిన అనంతరం కార్లోవిక్ తెలిపాడు. గతంలో మూడుసార్లు 50 అంతకంటే ఎక్కువ ఏస్'లు సంధించినా యూఎస్ ఓపెన్ లో మాత్రం ఈ సంఖ్యలో ఎవరూ సంధించకపోవడం గమనార్హం. కెరీర్ మొత్తంగా 11,277 ఏస్'లు సంధించిన కార్లోవిక్, రెండో స్థానంలో ఉన్న గోరాన్ ఇవానిసెవిక్ ఏస్'ల మధ్య వ్యత్యాసం 1000 అంటే మాటలు కాదు. ఓవరాల్ గా గ్రాండ్ స్లామ్ చరిత్రలో 113 ఏస్'లతో అత్యధికంగా ఆడిన ఆటగాడిగా జాన్ ఇస్నర్(వింబుల్డన్) పేరిట రికార్డు ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement