breaking news
Ivo Karlovic
-
అండర్సన్‌కు సింగిల్స్ టైటిల్ ...
టాటా ఓపెన్‌లో పురుషుల సింగిల్స్ టైటిల్‌ను ప్రపంచ ఆరో ర్యాంకర్ కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా) సాధించాడు. 100వ ర్యాంకర్ ఇవో కార్లోవిచ్ (క్రొయేషియా)తో 2 గంటల 44 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో అండర్సన్ 7–6 (7/4), 6–7 (2/7), 7–6 (7/5)తో గెలుపొందాడు. 6 అడుగుల 8 అంగుళాల ఎత్తు, 95 కేజీల బరువున్న అండర్సన్ మ్యాచ్‌లో 21 ఏస్‌లు... 6 అడుగుల 11 అంగుళాల ఎత్తు, 105 కేజీల బరువున్న కార్లోవిచ్ 36 ఏస్‌లు సంధించడం విశేషం. మ్యాచ్ మొత్తంలో ఒక్క బ్రేక్ పాయింట్ కూడా నమోదు కాకపోవడం విశేషం. చివరి సెట్ టైబ్రేక్‌లో 39 ఏళ్ల కార్లోవిచ్ 5–2తో ఆధిక్యంలో ఉన్నప్పటికీ... ఆ తర్వాత తడబడి వరుసగా ఐదు పాయింట్లు కోల్పోయి ఓటమి చవిచూశాడు. విజేత అండర్సన్‌కు 90,990 డాలర్ల (రూ. 63 లక్షల 29 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. -
మ్యాచ్ 314 నిమిషాలు...సెట్ 177 నిమిషాలు...
తొలి రెండు సెట్లు చేజార్చుకున్నా... విజయంపై ఆశలు వదులుకోకుండా తుదికంటా పోరాడిన క్రొయేషియా వెటరన్ టెన్నిస్ స్టార్ ఇవో కార్లోవిచ్ అనుకున్న ఫలితం సాధించాడు. టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రెండో రోజు కార్లోవిచ్, రాసియో జెబలోస్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్ హైలైట్‌గా నిలిచింది. విజయం కోసం ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. దాంతో మ్యాచ్‌లో ఫలితం రావడానికి ఏకంగా 314 నిమిషాలు పట్టింది. ఈ మ్యాచ్‌లో చివరిదైన ఐదో సెట్ ఒక్కటే 177 నిమిషాలు జరగడం విశేషం. తుదకు తన అనుభవాన్నంతా రంగరించి ఆడిన కార్లోవిచ్కే విజయం దక్కింది. ఈ క్రమంలో మూడు రికార్డులు తెరమరుగయ్యాయి. మెల్బోర్న్: వరుసగా 14వ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడుతోన్న క్రొయేషియా ఆజానుబాహుడు ఇవో కార్లోవిచ్ కాస్త అటుఇటు అయితే ఎనిమిదోసారి తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టేవాడు. కానీ 50వ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతోన్న అతను తొలి రెండు సెట్లు కోల్పోయినా ఓటమి ఆలోచనను తన మదిలోకి రానీయలేదు. పోరాడితే పోయేదేముందీ అనుకుంటూ మూడో సెట్ నుంచి తన ప్రయత్నంలో మరింత జోరు పెంచాడు. అదే ఉత్సాహంలో వరుసగా మూడు సెట్లు గెలిచాడు. చివరకు 5 గంటల 14 నిమిషాల్లో విజయాన్ని సొంతం చేసుకొని ఔరా అనిపించాడు. హోరాసియో జెబలోస్ (అర్జెంటీనా)తో మంగళవారం జరిగిన ఈ పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో కార్లోవిచ్ పోరాటపటిమ అందర్నీ ఆకట్టుకుంది. 20వ సీడ్‌గా బరిలోకి దిగిన కార్లోవిచ్ 6–7 (6/8), 3–6, 7–5, 6–2, 22–20తో ప్రపంచ 69వ ర్యాంకర్ జెబలోస్ను ఓడించి రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. ఈ మ్యాచ్‌లో ఒక్క ఐదో సెట్టే 2 గంటల 57 నిమిషాలు జరగడం విశేషం. ఆస్ట్రేలియన్ ఓపెన్ చరిత్రలో సుదీర్ఘంగా సాగిన ఐదో సెట్ ఇదే కావడం గమనార్హం. అంతేకాకుండా 1972లో టైబ్రేక్ నిబంధన మొదలయ్యాక అత్యధిక గేమ్‌లు (84) జరిగిన మ్యాచ్‌గానూ ఈ మ్యాచ్ నిలిచింది. 2003లో ఆండీ రాడిక్ (అమెరికా), యూనెస్ అల్ అయనూయి (మొరాకో) మధ్య జరిగిన మ్యాచ్‌లో 83 గేమ్‌లు జరిగాయి. అయితే సుదీర్ఘ సమయంపాటు జరిగిన మ్యాచ్ రికార్డును కార్లోవిచ్, జెబలోస్ బ్రేక్ చేయలేకపోయారు. జొకోవిచ్, నాదల్ మధ్య జరిగిన 2012 ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్ 5 గంటల 53 నిమిషాలు జరిగింది. ఏస్‌లతో అదరగొట్టి... 6 అడుగుల 11 అంగుళాల ఎత్తు, 105 కేజీల బరువున్న 37 ఏళ్ల కార్లోవిచ్ ఈ మ్యాచ్‌లో ఏకంగా 75 ఏస్‌లు సంధించాడు. తద్వారా ఆస్ట్రేలియన్ ఓపెన్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో అత్యధిక ఏస్‌లు కొట్టిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు జోచిమ్ జొహాన్సన్ (స్వీడన్) పేరిట ఉండేది. 2005లో ఆండ్రీ అగస్సీ (అమెరికా)తో జరిగిన మ్యాచ్‌లో జొహాన్సన్ 51 ఏస్‌లు కొట్టాడు. మ్యాచ్ మొత్తంలో 33 ఏస్‌లు కొట్టిన జెబలోస్ తొలి రెండు సెట్లు గెలిచి విజయం దిశగా సాగుతున్నట్లు కనిపించాడు. కానీ మూడో సెట్లో కార్లోవిచ్ పుంజుకున్నాడు. జెబలోస్ సర్వీస్‌ను ఒకసారి బ్రేక్ చేసి సెట్‌ను 7–5తో నెగ్గి మ్యాచ్‌లో నిలిచాడు. నాలుగో సెట్లో అదే జోరు కొనసాగించిన కార్లోవిచ్ ఈసారి రెండుసార్లు జెబలోస్ సర్వీస్‌ను బ్రేక్ చేసి సెట్‌ను 6–2తో దక్కించుకున్నాడు. అయితే ఐదో సెట్లో మాత్రం ఈ ఇద్దరూ కొదమ సింహాల్లా పోరాడారు. ఇద్దరూ తమ సర్వీస్‌లను నిలబెట్టుకోవడంతో మ్యాచ్ సుదీర్ఘంగా సాగింది. చివరకు 41వ గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకొని... 42వ గేమ్‌లో జెబలోస్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన కార్లోవిచ్ చిరస్మరణీయ విజయాన్ని దక్కించుకున్నాడు. సెరెనా శుభారంభం రికార్డుస్థాయిలో 23వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌పై గురి పెట్టిన అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్ తొలి అడ్డంకిని సులువుగానే అధిగమించింది. ప్రపంచ మాజీ ఏడో ర్యాంకర్ బెలిండా బెన్సిచ్ (స్విట్జర్లాండ్)తో జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో రెండో సీడ్ సెరెనా 6–4, 6–3తో గెలుపొందింది. 79 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సెరెనా ఎనిమిది ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఐదో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 6–2, 6–0తో సోరిబెస్ టోర్మో (స్పెయిన్)పై, మూడో సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలండ్) 6–1, 4–6, 6–1తో పిరన్కోవా (బల్గేరియా)పై, ఆరో సీడ్ సిబుల్కోవా (స్లొవేకియా) 7–5, 6–2తో అలెర్టోవా (చెక్ రిపబ్లిక్)పై, తొమ్మిదో సీడ్ జొహాన కొంటా (బ్రిటన్) 7–5, 6–2తో ఫ్లిప్కెన్స్ (బెల్జియం)పై నెగ్గారు. యూఎస్ ఓపెన్ మాజీ చాంపియన్, 18వ సీడ్ సమంతా స్టోసుర్ (ఆస్ట్రేలియా) 3–6, 6–3, 0–6తో హితెర్ వాట్సన్ (బ్రిటన్) చేతిలో ఓడిపోయింది. జొకోవిచ్, నాదల్ సులువుగా... మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), మాజీ విజేత రాఫెల్ నాదల్ (స్పెయిన్), మూడో సీడ్ మిలోస్ రావ్‌నిచ్ (కెనడా) తొలి రౌండ్‌ను సాఫీగా అధిగమించారు. ఫెర్నాండో వెర్డాస్కో (స్పెయిన్)తో జరిగిన మ్యాచ్‌లో రెండో సీడ్ జొకోవిచ్ 6–1, 7–6 (7/4), 6–2తో గెలుపొందగా... తొమ్మిదో సీడ్ నాదల్ 6–3, 6–4, 6–4తో మాయెర్ (జర్మనీ)పై, రావ్‌నిచ్ 6–3, 6–4, 6–2తో డస్టిన్ బ్రౌన్ (జర్మనీ)పై విజయం సాదించారు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో 11వ సీడ్ డేవిడ్ గాఫిన్ (బెల్జియం) 6–4, 4–6, 6–2, 4–6, 6–4తో ఒపెల్కా (అమెరికా)పై, 15వ సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా) 7–6 (7/2), 6–3, 6–3తో ఒకానెల్ (ఆస్ట్రేలియా)పై, ఎనిమిదో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రేలియా) 4–6, 6–4, 6–4, 6–3తో స్ట్రఫ్ (జర్మనీ)పై, ఆరో సీడ్ మోన్ఫిల్స్ (ఫ్రాన్స్) 6–2, 6–3, 6–2తో వెసిలీ (చెక్ రిపబ్లిక్)పై, 13వ సీడ్ బాటిస్టా అగుట్ (స్పెయిన్) 6–3, 6–1, 6–1తో పెలా (అర్జెంటీనా)పై నెగ్గారు. వెర్డాస్కోతో 2 గంటల 20 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో జొకోవిచ్ ఆరుసార్లు తన ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. మాయెర్తో రెండు గంటల నాలుగు నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో నాదల్ ఆరు ఏస్‌లు సంధించగా... ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయలేదు. ఒక్క బ్రేక్ పాయింట్ అవకాశం కూడా ఇవ్వని నాదల్ ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశాడు. -
'ఏస్'లతో సరికొత్త రికార్డు!
యూఎస్ ఓపెన్ లో భాగంగా క్రొయేషియా టెన్నిస్ స్టార్ ఇవో కార్లోవిక్ తన పదునైన సర్వీస్ తో రికార్డు సృష్టించాడు. మంగళవారం రాత్రి జరిగిన తొలిరౌండ్లో ప్రత్యర్థిపై ఏకంగా రికార్డు స్థాయిలో 61 ఏస్ లు సంధించి గతంలో ఉన్న 49 ఏస్'ల రికార్డు తిరగరాశాడు. తైవాన్ ప్లేయర్ లు యెన్సన్ పై 4-6, 7-6 (7/4), 6-7 (4/7), 7-6 (7/5), 7-5 తేడాతో నెగ్గి కార్లోవిక్ రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. ఆరడుగుల పదకొండు అంగులాల ఎత్తుండే ఈ ఆటగాడు ప్రత్యర్థిపై నెగ్గేందుకు ఏస్ లను తన అమ్ములపొదిలో ప్రధాన అస్త్రంగా మార్చుకున్నాడు. తొలి సెట్ ప్రత్యర్థిగా కోల్పోయిన తాను ముఖ్యంగా చెప్పాలంటే రెండో సెట్లో దాదాపు నేను ఆడిన షాట్లలో ఎక్కువగా ఏస్ ఉన్నాయని ఐదు సెట్ల సుదీర్ఘ మ్యాచ్ ముగిసిన అనంతరం కార్లోవిక్ తెలిపాడు. గతంలో మూడుసార్లు 50 అంతకంటే ఎక్కువ ఏస్'లు సంధించినా యూఎస్ ఓపెన్ లో మాత్రం ఈ సంఖ్యలో ఎవరూ సంధించకపోవడం గమనార్హం. కెరీర్ మొత్తంగా 11,277 ఏస్'లు సంధించిన కార్లోవిక్, రెండో స్థానంలో ఉన్న గోరాన్ ఇవానిసెవిక్ ఏస్'ల మధ్య వ్యత్యాసం 1000 అంటే మాటలు కాదు. ఓవరాల్ గా గ్రాండ్ స్లామ్ చరిత్రలో 113 ఏస్'లతో అత్యధికంగా ఆడిన ఆటగాడిగా జాన్ ఇస్నర్(వింబుల్డన్) పేరిట రికార్డు ఉంది.