రోహిత్‌ క్రికెటర్‌ కాదన్న పఠాన్‌.. సమర్థించిన షమీ | Irfan Pathan And Shami Praises Rohit And Says He Is A Pure Batsman | Sakshi
Sakshi News home page

రోహిత్‌ క్రికెటర్‌ కాదన్న పఠాన్‌.. సమర్థించిన షమీ

Apr 19 2020 2:05 PM | Updated on Apr 19 2020 2:05 PM

Irfan Pathan And Shami Praises Rohit And Says He Is A Pure Batsman - Sakshi

హైదరాబాద్‌: టీమిండియా హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మపై కామెంటేటర్‌గా అవతారమెత్తిన మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత స్టార్‌ బౌలర్‌ మహ్మద్‌ షమీతో ఇన్‌స్టా లైవ్‌ సెషన్‌లో పాల్గొన్న ఇర్ఫాన్‌ రోహిత్‌పై పొగడ్తల వర్షం కురిపించాడు. ‘నేను లైవ్‌ కామెంటరీ చేస్తున్న సమయంలో రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌ చూస్తూ ఆస్వాదిస్తుంటాను. రోహిత్‌ క్రికెటర్‌ కాదు.. అతడొక కవి అని నా ఉద్దేశం. అతడి బ్యాటింగ్‌ వెన్న పూసినట్లు సున్నితంగా ఉంటుంది. కవులు కూడా అంతే వారు చెప్పాలనుకునేది కూడా సుతిమెత్తంగా చెబుతారు. ఇక బౌలర్లు కూడా తమ బౌలింగ్‌లో అతడు దాడి చేస్తున్నారనే విషయాన్ని కూడా మర్చిపోతారు. అంతలా రోహిత్‌ బ్యాటింగ్‌ను ఎంజాయ్‌ చేస్తారు’ అంటూ ఇర్ఫాన్‌ పఠాన్‌ పేర్కొన్నాడు. 

ఇక ఇర్ఫాన్‌ వ్యాఖ్యలను మహ్మద్‌ షమీ సమర్థించాడు. ‘రోహిత్‌ శర్మ పరిపూర్ణమైన బ్యాట్స్‌మన్‌. ఎలాంటి పరిస్థుతుల్లోనైనా పరుగులు రాబట్టడం, దాటిగా బ్యాటింగ్‌ చేయగల సామర్థ్యం ఉంది. అతడి నుంచి యువ క్రికెటర్లు ఎంతగానో నేర్చుకోవచ్చు. ఎలాంటి బౌలింగ్‌లో అతడు దాడికి దిగుతున్నాడో బౌలర్‌ నేర్చుకుంటాడు. అదేవిధంగా క్రీజులో నిల్చొని పరుగుల వరద ఎలా పారించాలో బ్యాట్స్‌మన్‌ నేర్చుకుంటాడు. అందుకే క్రికెట్‌ నేర్చుకునే వారికి రోహిత్‌ ఓ బెస్ట్‌ ప్యాకేజీ అని నా అభిప్రాయం’అని మహ్మద్‌ షమీ పేర్కొన్నాడు. 

చదవండి:
చెప్పేవారు లేరు... చెబితే వినేవారు లేరు!
అప్పుడు రైనాకే ధోని ఓటేశాడు: యువీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement