
బెంగళూరు: సాంకేతిక ఆవిష్కరణలో భాగంగా ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రకటించింది. మూడేళ్లు కొనసాగే ఈ భాగస్వామ్యం ద్వారా కొత్త తరహా సేవలందించడానికి అవకాశం లభించినట్లుగా భావిస్తున్నామని కంపెనీ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ సలీల్ పరేఖ్ అన్నారు. ‘డిజిటల్ టెక్నాలజీ హద్దులను దాటుకుని ఎంత వరకు వెళ్లగలదనే అంశాన్ని టోర్నమెంట్‌లో ప్రదర్శించాలని అనుకుంటున్నాం. టోర్నీ చూసే విధానంలో మార్పులు తేవాలని భావిస్తున్నాం.’ అని వ్యాఖ్యానించారు.