ఈ ఏడాది అక్టోబరులో భారత్‌లో జరిగే అండర్–17 ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో భారత జట్టు ఆడే మ్యాచ్‌ల వేదికలో
న్యూఢిల్లీ: ఈ ఏడాది అక్టోబరులో భారత్‌లో జరిగే అండర్–17 ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో భారత జట్టు ఆడే మ్యాచ్‌ల వేదికలో మార్పు చోటు చేసుకుంది. ఇంతకుముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం భారత జట్టు తమ మ్యాచ్‌లను నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఆడాల్సింది.
తాజా మార్పు ప్రకారం భారత్ ఆడే మ్యాచ్‌లను న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఏర్పాటు చేయాలని నిర్వాహకులను భారత ఫుట్‌బాల్ సమాఖ్య కోరింది.