ఏషియన్‌ గేమ్స్‌; దుష్యంత్‌కు కాంస్యం

Indian rower Dushyant wins bronze medal in Men's Lightweight Single Sculls - Sakshi

జకార్తా: ఏషియన్‌ గేమ్స్‌ 2018లో భాగంగా రోయింగ్‌ విభాగంలో భారత్‌కు కాంస్య పతకం దక్కింది.  పురుషుల సింగిల్‌ స్కల్స్‌ ఈవెంట్‌లో భారత రోయర్‌ దుష్యంత్‌ చౌహాన్‌ కాంస్యం పతకం సాధించాడు. శుక్రవారం ఉదయం జరిగిన ఫైనల్‌ హీట్‌లో దుష్యంత్‌ 7:18: 76 సెకన్లతో వేగవంతమైన టైమింగ్‌ నమోదు చేసి ఓవరాల్‌గా మూడో స్థానంలో నిలిచి కాంస్యాన్ని దక్కించుకున్నాడు.  అంతకుముందు దుష్యంత్‌ ఫైనల్‌కు చేరే క్రమంలో 7:43.08 సెకన్లతో హీట్‌-1ను పూర్తి చేశాడు.

ఫలితంగా ఓవరాల్‌ రెండో స్థానంతో ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. ఆపై ఫైనల్‌ కూడా ఆకట్టుకున్న దుష్యంత్‌ కాంస్యంతో మెరిశాడు. గత ఏషియన్‌ గేమ్స్‌లో సైతం దుష్యంత్‌ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఇక పురుషుల లైట్‌ వెయిట్‌ డబుల్‌ స్కల్క్‌లో భారత్‌కు కాంస్యం సాధించింది. భారత రోయర్లు రోహిత్‌ కుమార్‌-భగవాన్‌ సింగ్‌ జోడి మూడో స్థానంలో నిలిచి కాంస్యాన్ని సాధించారు. ఫైనల్స్‌లో  07:04:61 సెకన్లతో  మూడో స్థానంలో నిలిచారు. ప్రస్తుత ఏషియన్‌ గేమ్స్‌లో భారత జట్టు ఇప్పటివరకూ 20 పతకాలను ఖాతాలో వేసుకుంది. ఇందులో నాలుగు స్వర్ణాలు, నాలుగు రజతాలు, 12 కాంస్య పతకాలు ఉన్నాయి. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top