
భారత్-దక్షిణాఫ్రికా టెస్ట్ కు వర్షం ఆటంకం
భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ కు వర్షం అంతరాయం కలిగించింది.
బెంగళూరు: భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ కు వర్షం అంతరాయం కలిగించింది. వర్షం కారణంగా రెండో రోజు ఆట ప్రారంభం కాలేదు. మధ్యాహ్నం వరకు వాన కురుస్తుండడంతో మొదటి సెషన్ ఆట సాగలేదు. వర్షం తగ్గే పరిస్థతి కనబడకపోవడంతో రెండో రోజు ఆట రద్దయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.
ఆదివారం టీమిండియా-సౌతాఫ్రికా ఆట వీక్షించాలనుకున్న అభిమానులకు వర్షం నిరాశ కలిగించింది. తొలి ఇన్నింగ్స్ లో 214 పరుగులకు దక్షిణాఫ్రికా ఆలౌటైంది. టీమిండియా 80/0 స్కోరు చేసింది.