యువ భారత్‌ శుభారంభం

India Under 19 Won By 90 Runs Against Sri Lanka - Sakshi

తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై 90 పరుగులతో గెలుపు

బ్లోమ్‌ఫొంటెన్‌: డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ అండర్‌–19 ప్రపంచకప్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో శుభారంభం చేసింది. శ్రీలంకతో ఆదివారం జరిగిన గ్రూప్‌ ‘ఎ’ లీగ్‌ మ్యాచ్‌లో యువ భారత్‌ 90 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిరీ్ణత 50 ఓవర్లలో 4 వికెట్లకు 297 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్‌ (59; 8 ఫోర్లు), హైదరాబాద్‌ ప్లేయర్‌ ఠాకూర్‌ తిలక్‌వర్మ (46; 3 ఫోర్లు), కెపె్టన్‌ ప్రియమ్‌ గార్గ్‌ (56; 2 ఫోర్లు) రాణించి భారత ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేయగా...చివర్లో ధ్రువ్‌ జురెల్‌ (48 బంతుల్లో 52 నాటౌట్‌; 3 ఫోర్లు, సిక్స్‌), ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సిద్ధేశ్‌ వీర్‌ (27 బంతుల్లో 44 నాటౌట్‌; 6 ఫోర్లు, సిక్స్‌) ధాటిగా ఆడారు. 298 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 45.2 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది. నిపున్‌  పెరీరా (50; 2 ఫోర్లు, సిక్స్‌), రవీందు (49; 5 ఫోర్లు) మినహా మిగతావారు విఫలమయ్యారు. భారత బౌలర్లలో ఆకాశ్‌ సింగ్, సిద్ధేశ్‌ వీర్, రవి బిష్ణోయ్‌ రెండేసి వికెట్లు తీశారు. మంగళవారం జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో జపాన్‌తో భారత్‌ ఆడుతుంది.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top