
బెంగళూరు టెస్టు; మూడో రోజూ వర్షం ఆటంకం
భారత్- దక్షిణాఫ్రికా రెండో టెస్టు మూడో రోజు సోమవారం ఆటకు వర్షం ఆటంకం కలిగించింది.
బెంగళూరు: భారత్- దక్షిణాఫ్రికా రెండో టెస్టు మూడో రోజు సోమవారం ఆటకు వర్షం ఆటంకం కలిగించింది. బెంగళూరులో భారీ వర్షం కురుస్తుండటంతో వేదిక చిన్నస్వామి స్టేడియం చిత్తడిగా మారిపోయింది. దీంతో ఈ రోజు మ్యాచ్ ఇంకా మొదలుకాలేదు.
ఆదివారం కూడా వర్షం కురవడంతో రెండో రోజు ఆట ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయిన సంగతి తెలిసిందే. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా గత కొన్ని రోజులుగా బెంగళూరులో వర్షాలు కురుస్తున్నాయి. మ్యాచ్ తొలి రోజు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 214 పరుగులకు ఆలౌట్ కాగా, టీమిండియా 80/0 స్కోరు చేసింది.