'నేను కెప్టెన్గా ఫిట్ కాను' | I am not fit as a captain, the pressure is too much playing for Pakistan, says Shahid Afridi | Sakshi
Sakshi News home page

'నేను కెప్టెన్గా ఫిట్ కాను'

Mar 25 2016 7:00 PM | Updated on Sep 3 2017 8:34 PM

'నేను కెప్టెన్గా ఫిట్ కాను'

'నేను కెప్టెన్గా ఫిట్ కాను'

వరల్డ్ ట్వంటీ 20లో ఆస్ట్రేలియాపై ఓటమి అనంతరం పాకిస్తాన్ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.

మొహాలి:వరల్డ్ ట్వంటీ 20లో ఆస్ట్రేలియాపై ఓటమి అనంతరం పాకిస్తాన్ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాను అసలు పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు కెప్టెన్గా చేయడానికి అర్హుడిని కానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ జట్టుకు సారథ్యం వహించే క్రమంలో తీవ్రమైన ఒత్తిడికి లోను కావడమే ఇందుకు కారణమన్నాడు.  అయితే పాక్ కు కెప్టెన్ చేయడాన్ని ఎంజాయ్ చేశానన్నాడు.


కాగా, ఆసీస్తో జరిగిన మ్యాచే తనకు చివరి మ్యాచ్ అంటూ వార్తలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఆఫ్రిది స్పందించాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నాడు. పాకిస్తాన్లో దేశ ప్రజల సమక్షంలో దీనిపై నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు. నాలుగైదు రోజుల్లో స్వదేశానికి చేరతామని, ఆ తరువాతే తన రిటైర్మెంట్పై నిర్ణయం వెలువరిస్తానన్నాడు. పాకిస్తాన్ జట్టుకు  దేనివల్ల మంచి జరుగుతుందో అది చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆఫ్రిది స్పష్టం చేశాడు.  కోల్ కతాలో భారత్తో జరిగిన మ్యాచ్కు పాకిస్తాన్ నుంచి, కశ్మీర్ నుంచి వచ్చి తమ జట్టుకు మద్దతు తెలిపిన వారికి ఆఫ్రిది కృతజ్ఞతలు తెలిపాడు.

ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ 21పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. తద్వారా టోర్నీలో మూడో పరాజయాన్ని మూటగట్టుకున్న పాకిస్తాన్ వరల్డ్ టీ 20 నుంచి నిష్క్రమించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement