ఫుట్ బాల్ ఫైనల్ మ్యాచ్ కు భారీ భద్రత | heavy police security for foot ball final match | Sakshi
Sakshi News home page

ఫుట్ బాల్ ఫైనల్ మ్యాచ్ కు భారీ భద్రత

Jul 12 2014 4:40 PM | Updated on Oct 22 2018 5:58 PM

2014 ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ టోర్నీ తుది అంకానికి చేరుకుంది. గత కొన్ని రోజుల నుంచి బ్రెజిల్ ను హోరెత్తిస్తున్నఫుట్ బాల్ ఫీవర్ ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ తో ముగియనుంది.


రియో డి జనీరో: 2014 ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ టోర్నీ తుది అంకానికి చేరుకుంది. గత కొన్ని రోజుల నుంచి బ్రెజిల్ ను హోరెత్తిస్తున్నఫుట్ బాల్ ఫీవర్ ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ తో  ముగియనుంది. అర్జెంటీనా-జర్మనీ జట్ల మధ్య జరిగే తుది మ్యాచ్ కు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. రియోలోని మారకానా స్టేడియంలో జరుగనున్నఈ మ్యాచ్ కు దాదాపు 25వేల మంది పోలీసులను మోహరిస్తున్నారు. 1990 లో జర్మనీ చేతిలో కంగుతిన్న అర్జెంటీనాకు పక్కాప్రణాళికతో బరిలో దిగాలని యోచిస్తోంది. అర్జెంటీనా కు చెందిన మాజీ స్టార్ ప్లేయర్ డిగో మారడోనా టీం సభ్యులకు సలహాలు ఇచ్చేందుకు జట్టుతో భేటీ కానున్నాడు.

 

ఇదిలా ఉండగా రేపు జరిగే మ్యాచ్ లో ఇదిలా ఉండగా సాకర్ ప్రపంచకప్‌ను అట్టహాసంగా ముగించేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. ప్రపంచకప్ ఫైనల్‌కు ముందు భారత కాలమానం ప్రకారం రాత్రి గం. 10.50 ని.లకు ముగింపు కార్యక్రమం మొదలవుతుంది. కొలంబియా పాప్ స్టార్ షకీరా ఈ కార్యక్రమంలో బ్రెజిల్ ఆర్టిస్ట్ కార్లినో బ్రౌన్‌తో కలిసి సందడి చేయనుంది. ఫిఫా అధికారిక గీతమైన ‘లా లా లా’తో అభిమానులను అలరించనుంది. ఫిఫా అధికారికంగా ప్రకటించిన ముగింపు కార్యక్రమంలో కార్లోస్ శాంటనా, వెసైల్ఫ్ జీన్ తమ ప్రదర్శనతో ఆకట్టుకోనున్నారు. బ్రెజిల్ సూపర్ స్టార్ సాంగాలో.. అలెగ్జాండర్ పెరైస్‌తో కలిసి హల్‌చల్ చేయనున్నారు. ఇక ఫైనల్ ఆరంభానికి కొద్ది నిమిషాల ముందు స్పెయిన్ ఫుట్‌బాలర్ కార్లెస్ పుయోల్, బ్రెజిల్ సూపర్ మోడల్ గిసెలీ బుండ్చెన్ ప్రపంచకప్ ట్రోఫీని ఆవిష్కరిస్తారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement