అంతిమ సమరంలో సౌరవ్‌ కొఠారి పరాజయం

Gilchrist Beats Kothari To Reclaim World Billiards Title - Sakshi

మెల్‌బోర్న్‌: ప్రపంచ బిలియర్డ్స్‌ చాంపియన్‌షిప్‌ లాంగ్‌ అప్‌ ఫార్మాట్‌లో భారత ప్లేయర్‌ సౌరవ్‌ కొఠారి రన్నరప్‌గా నిలిచాడు. మెల్‌బోర్న్‌లో ఆదివారం జరిగిన ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ సౌరవ్‌ 967–1307తో పీటర్‌ గిల్‌క్రిస్ట్‌ (సింగపూర్‌) చేతిలో ఓడిపోయాడు. పలుమార్లు ఆధిక్యం చేతులు మారిన ఈ మ్యాచ్‌లో మొదటి సెషన్‌లో కొఠారి ఆధిక్యం ప్రదర్శించాడు.

అయితే రెండో సెషన్‌లో తడబడి ప్రత్యర్థికి పుంజుకునే అవకాశం ఇచ్చాడు. ఒకదశలో 250 పాయింట్లతో వెనుకంజలో ఉన్న గిల్‌క్రిస్ట్‌ 313 పాయింట్లు సాధించి 949–917తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఇదే జోరును మూడో సెషన్‌లోనూ కొనసాగించి  పీటర్‌ విజేతగా నిలిచాడు.,

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top