ఫైనల్లో జర్మనీ, ఫ్రాన్స్ | France set up historic Junior Hockey World Cup final date against Germany | Sakshi
Sakshi News home page

ఫైనల్లో జర్మనీ, ఫ్రాన్స్

Dec 14 2013 1:34 AM | Updated on Sep 2 2017 1:34 AM

ఫైనల్లో జర్మనీ, ఫ్రాన్స్

ఫైనల్లో జర్మనీ, ఫ్రాన్స్

తమ జోరును కొనసాగిస్తూ డిఫెండింగ్ చాంపియన్ జర్మనీ ప్రపంచ కప్ జూనియర్ హాకీ టోర్నమెంట్‌లో టైటిల్ పోరుకు అర్హత సాధించింది.

న్యూఢిల్లీ: తమ జోరును కొనసాగిస్తూ డిఫెండింగ్ చాంపియన్ జర్మనీ ప్రపంచ కప్ జూనియర్ హాకీ టోర్నమెంట్‌లో టైటిల్ పోరుకు అర్హత సాధించింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో జర్మనీ 5-3 గోల్స్ తేడాతో నెదర్లాండ్స్‌ను ఓడించింది. ఆదివారం జరిగే ఫైనల్లో ఫ్రాన్స్‌తో జర్మనీ అమీతుమీ తేల్చుకుంటుంది. మరో సెమీఫైనల్లో ఫ్రాన్స్ ‘షుటౌట్’లో 3-1తో మలేసియాపై నెగ్గి ఈ మెగా ఈవెంట్‌లో తొలిసారి ఫైనల్లోకి ప్రవేశించింది. విరామ సమయానికి రెండు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. ఫలితం తేలడానికి టైబ్రేక్‌ను నిర్వహించగా ఫ్రాన్స్ పైచేయి సాధించింది.
 
 నేడు భారత్ x పాక్: మరోవైపు చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు శనివారం తొమ్మిదో స్థానం కోసం పోటీపడనున్నాయి. నిరాశజనక ప్రదర్శన కనబరిచిన ఈ రెండు జట్లు లీగ్ దశలోనే నిష్ర్కమించి వర్గీకరణ మ్యాచ్‌లు ఆడుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement