breaking news
junnior hockey tournment
-
హైదరాబాద్ కెప్టెన్‌గా రోహిత్ సింగ్
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఆలిండియా కేడీ సింగ్ బాబు ట్రోఫీ సబ్ జూనియర్ హాకీ టోర్నమెంట్లో పాల్గొనే హాకీ హైదరాబాద్ (హెచ్‌హెచ్) జట్టుకు రోహిత్ సింగ్ సారథ్యం వహిస్తాడు. ఈపోటీలు ఈనెల 24 నుంచి వచ్చేనెల 2 వరకు లక్నోలో జరుగుతాయి. జింఖానా మైదానంలో జరిగిన ఒక కార్యక్రమంలో హెచ్‌హెచ్ అధ్యక్షుడు, సీనియర్ ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ మాట్లాడుతూ స్కూల్ స్థాయిలోనే హాకీ క్రీడల్లో చిన్నారులను ప్రోత్సహించాలన్నారు. హాకీ అభివృద్ధికి స్కూల్ యాజమాన్యాలు ముందుకు రావాలని ఆయన కోరారు. ఈకార్యక్రమంలో హెచ్‌హెచ్ ప్రధాన కార్యదర్శి ఎన్.ముఖేష్ కుమార్, సురేందర్ సింగ్, జ్ఞాన్ చంద్ తదితరులు పాల్గొన్నారు. జట్టు: రోహిత్ సింగ్(కెప్టెన్), ఎస్.సందీప్ (వైస్ కెప్టెన్), ఇ.వెంకటేష్, ఎస్.నవీన్ కుమా ర్ రెడ్డి, ఎం.ఎ.రహ్మాన్, ఎస్.గణేష్, ధర్మవీర్ చంద్, షాబాజ్, ఎ.కృష్ణ సింగ్, షేక్ అమీన్, కార్తికేయ రెడ్డి, జె.రోహిత్, కె.జయప్రకాష్‌రెడ్డి, కె.యశ్వంత్ ముదిరాజ్, టి.గంజేందర్ సింగ్, ఎం.ధీరజ్, జ్ఞాన్‌చంద్ (కోచ్), ఉదయ్ వేలు (మేనేజర్). స్టాండ్‌బైస్: కె.గౌతమ్, ఎస్.కిరణ్ కుమార్, ఎం.డి.రెహ్మాన్, ఎం.డి.హుజఫుల్లా. -
ఫైనల్లో జర్మనీ, ఫ్రాన్స్
న్యూఢిల్లీ: తమ జోరును కొనసాగిస్తూ డిఫెండింగ్ చాంపియన్ జర్మనీ ప్రపంచ కప్ జూనియర్ హాకీ టోర్నమెంట్లో టైటిల్ పోరుకు అర్హత సాధించింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో జర్మనీ 5-3 గోల్స్ తేడాతో నెదర్లాండ్స్‌ను ఓడించింది. ఆదివారం జరిగే ఫైనల్లో ఫ్రాన్స్‌తో జర్మనీ అమీతుమీ తేల్చుకుంటుంది. మరో సెమీఫైనల్లో ఫ్రాన్స్ ‘షుటౌట్’లో 3-1తో మలేసియాపై నెగ్గి ఈ మెగా ఈవెంట్లో తొలిసారి ఫైనల్లోకి ప్రవేశించింది. విరామ సమయానికి రెండు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. ఫలితం తేలడానికి టైబ్రేక్‌ను నిర్వహించగా ఫ్రాన్స్ పైచేయి సాధించింది. నేడు భారత్ x పాక్: మరోవైపు చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు శనివారం తొమ్మిదో స్థానం కోసం పోటీపడనున్నాయి. నిరాశజనక ప్రదర్శన కనబరిచిన ఈ రెండు జట్లు లీగ్ దశలోనే నిష్ర్కమించి వర్గీకరణ మ్యాచ్‌లు ఆడుతున్నాయి.