రెండో వన్డే అప్‌డేట్స్‌: ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ జోయ్‌ రూట్‌

England Win the Toss And Elect Bat First Against India - Sakshi

లార్డ్స్‌ : ప్రతిష్టాత్మకరమైన లార్డ్స్‌  మైదానంలో  ఇండియా, ఇంగ్లండ్‌ల మధ్య కీలకమైన రెండో వన్డే జరుగుతోంది. కోహ్లి సేనతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఇయన్‌ మోర్గాన్‌ సేనకు ఈ మ్యాచ్‌ అత్యంత కీలకం. రెండు జట్లు ఏ విధమైన మార్పులు లేకుండా మొదటి వన్డే ఆడిన టీంతోనే బరిలోకి దిగాయి. మొదటి వన్డేలో కుల్దీప్‌ విజృంభించి ఇండియాకు విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. మూడు వన్డేల సిరీస్‌లో కోహ్లిసేన వరుసగా రెండో వన్డే గెలిచి కప్‌ కైవసం చేసుకోవాలని చూస్తోంది. మ్యాచ్‌ అప్‌డేట్స్‌ ఇవి..

  • ఇరుజట్ల మధ్య నిర్ణయాత్మకమైన మూడో వన్డే మంగళవారం(జులై 17)న జరగనుంది.
     
  • ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ జోయ్‌ రూట్‌
     
  • మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసిన ఇంగ్లండ్‌
     
  • 86 పరుగుల తేడాతో టీమిండియా ఘోర ఓటమి
     
  • వన్డేల్లో పదివేల పరుగుల క్లబ్‌లో చేరిన టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని
     
  • ఏడో వికెట్‌ కోల్పోయిన టీమిండియా, ఉమేశ్‌ యాదవ్‌ డకౌట్‌
     
  • ఆరో వికెట్‌ కోల్పోయిన టీమిండియా, ప్లంకెట్‌ బౌలింగ్‌లో హార్దిక్‌ పాండ్యా(21) కీపర్‌ క్యాచ్‌ ఔట్‌
     
  • 35 ఓవర్లలో టీమిండియా ఐదు వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. ప్రస్తుతం ధోని(13), పాండ్యా (10) బ్యాటింగ్‌ చేస్తున్నారు.
     
  • భారత్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. సురేష్‌ రైనా 46 వ్యక్తిగత పరుగుల వద్ద వెనుదిరిగాడు. రషీద్‌ వేసిన 32వ ఓవర్‌లో తొలి బంతికే బౌల్డ్‌ అయ్యాడు. 31.1 ఓవర్లకు టీమిండియా స్కోర్‌ 154/5.
     
  • టీమిండియా సారధి విరాట్‌ కోహ్లి 45 పరుగుల వద్ద ఔట్‌ అయ్యాడు. భారత్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. మొయిన్‌ అలీ వేసిన 27వ ఓవర్‌లో చివరి బంతికి ఎల్‌బీడబ్య్లూగా వెనుదిరిగాడు. ఇండియా 27 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. 38 పరుగులతో సురేష్‌ రైనా ఆడుతున్నాడు. 
     
  •  లక్ష్య ఛేదనలో కోహ్లిసేన 25 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. కోహ్లి, సురేష్‌ రైనాలు నెమ్మదిగా ఆడుతూ వికెట్‌ పడకుండా కాపాడుతున్నారు. కోహ్లి 42 పరుగులతో, సురేష్‌ రైనా 34 పరుగులతో ఆడుతున్నారు.
     
  • టీమిండియా 21 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 112 పరుగుల చేసింది. విరాట్‌ కోహ్లి(32), సురేష్‌ రైనా(23) పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.
     
  • భారత్‌ 15 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 90 పరుగుల చేసింది. విరాట్‌ కోహ్లి(19), సురేష్‌ రైనా(12) పరుగులతో బ్యాటింగ్‌ చేస్తున్నారు.
     
  • టీమిండియా 12 ఓవర్లకు మూడు వికెట్లు నష్టపోయి 65 పరుగులు చేసింది. ప్రస్తుతం విరాట్‌ కోహ్లి(7), సురేష్‌ రైనాలు(3) క్రీజ్‌లో ఉన్నారు. 
     
  • శిఖర్‌ ధావన్ ఔట్‌ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన లోకేష్‌ రాహుల్‌ నిరాశ పరిచాడు. లియామ్‌ ప్లంకెట్ వేసిన 11వ ఓవర్‌లో ఐదో బంతికి బట్లర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 60 పరుగులకే టీమిండియా మూడు వికెట్లు కోల్పోయింది.
     
  • 57 పరుగులు వద్ద టీమిండియా రెండో వికెట్‌ కోల్పోయింది. టీమిండియా 10 ఓవర్‌లో చివరి బంతికి ధావన్‌ వికెట్‌ను కోల్పోయింది. డేవిడ్‌ విల్లే వేసిన బౌలింగ్‌లో స్టోక్స్‌కు క్యాచ్‌ ఇచ్చి ధావన్‌(36) ఔట్‌ అయ్యాడు.  ప్రస్తుతం కోహ్లి(5), లోకేష్‌ రాహుల్‌(0) పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.
     
  • భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోహ్లీ సేన నిలకడగా బ్యాటింగ్‌ చేస్తోంది. భారత్‌ 7 ఓవర్లలో 45 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ రోహిత్‌ శర్మ 13 పరుగులు, ధావన్‌ 29 పరుగులతో క్రీజులో ఉన్నారు.
  • జో రూట్‌ సెంచరీతో చెలరేగడం.. ఆరోస్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన డేవిడ్‌ విల్లే 31 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 50 పరుగులు చేయడంతో ఇంగ్లండ్‌ జట్టు భారత్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి.. ఇంగ్లండ్‌ జట్టు 322 పరుగులు చేసింది. భారత్‌కు 323 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
     
  • భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ ఒక్కడే ఒక మోస్తరుగా రాణించి మూడు వికెట్లు పడగొట్టాడు. ఉమేష్ యాదవ్, యజువేంద్ర చాహల్‌, హరిక్ పాండ్య తలో వికెట్‌ తీసుకున్నారు. 8 ఓవర్లు వేసిన సిద్ధార్థ కౌల్‌ (59 పరుగులు ఇచ్చాడు), రెండు ఓవర్లు వేసిన సురేశ్‌ రైనా వికెట్‌ తీయలేకపోయారు.
     
  • ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌లో జాసన్ రాయ్ 40 పరుగులు, జానీ బెయిర్‌ స్టో 38 పరుగులు, జో రూట్ 113 పరుగులు (నాటౌట్‌), ఇయాన్ మోర్గాన్ 53 పరుగులు, బెన్ స్టోక్స్ 5 పరుగులు, జోస్ బట్లర్ 4 పరుగులు, మోయిన్ ఆలీ 13 పరుగులు, డేవిడ్ విల్లీ 50 పరుగులు చేశారు.
     
  • ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ జో రూట్‌ రెండో వన్డేలో ఒంటరి పోరాటం చేశాడు. జో రూట్‌ 109 బంతుల్లో సెంచరీ నమోదు చేశాడు. వచ్చిన ఆటగాళ్లు వరుసగా ఫెవిలియన్‌ బాట పట్టగా జో రూట్‌ మ్యాచ్‌ను తన భూజాలపై వేసుకుని ముందుకు నడిపించాడు. 48 ఓవర్లకు ఇంగ్లండ్‌ స్కోర్‌ 305/6.
  • రోహిత్‌ చక్కటి డ్రైవ్‌ కొట్టి అద్భుత క్యాచ్‌ అందుకున్నాడు. చహల్‌ వేసిన 42వ ఓవర్‌లో నాల్గో బంతికి మొయిన్‌ ఆలీ భారీ షాట్‌ ఆడబోయి రోహిత్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. 240 పరుగుల వద్ద ఇంగ్లండ్‌ ఆరో వికెట్‌ను కోల్పోయింది. ప్రస్తుతం జో రూట్‌(88), మొయిన్‌ అలీ(6) డేవిడ్‌ విల్లే(0) క్రీజ్‌లో ఉన్నారు. 
       
  • 40 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి ఇంగ్లండ్‌ 228 పరుగులు చేసింది. ప్రస్తుతం జో రూట్‌(78), మొయిన్‌ అలీ(6) పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. 
       
  • ఇంగ్లండ్‌ 214 పరుగుల వద్ద ఐదో వికెట్‌ కోల్పోయింది. ఉమేష్‌ యాదవ్‌ బౌలింగ్‌లో జాస్‌ బట్లర్ ధోనికి క్యాచ్‌ ఇచ్చి ఫెవిలియన్‌ బాటపట్టాడు. 36.3 ఓవర్ల వద్ద ఇంగ్లండ్‌ స్కోర్‌ 214/5.
     
  • 203 పరుగుల వద్ద ఇంగ్లండ్‌ మరో వికెట్‌ కోల్పోయింది. హార్థిక్‌ పాండ్యా బౌలింగ్‌లో బెన్‌ స్టోక్స్‌ కీపర్‌ ధోనీకి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. స్టోక్స్‌ ఎనిమిది బంతుల్లో ఐదు పరుగులు చేశాడు. దీంతో 34 ఓఇవర్లలో ఇంగ్లండ్‌ 203 పరుగులు చేసింది. జో రూట్‌ (63) , జోస్‌ బట్లర్‌ క్రీజ్‌లో ఉన్నారు.
     
  • 30.3 ఓవర్‌లో మూడో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌. మోర్గాన్‌ 53 పరుగుల వద్ద కుల్దీవ్‌ ఓవర్‌లో భారీ షాట్‌ ఆడబోయి ధావన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఇంగ్లండ్‌ స్కోర్‌: 189/3. తన స్పిన్‌ మాయతో మూడు వికెట్లు తన ఖాతాలో కుల్దీప్‌ వేసుకున్నాడు.
     
  • కుల్దీప్‌ బౌలింగ్‌లో వరుసగా ఓపెనర్లను కోల్పోయిన ఇంగ్లండ్‌ జట్టును అనంతరం వచ్చిన జోయ్‌ రూట్‌, కెప్టెన్‌ ఈయాన్‌ మోర్గాన్‌ ఆదుకున్నారు. భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ.. నిలకడగా ఈ ఆడుతున్న ఈ ఇద్దరు.. 28 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్‌ను పటిష్ట స్థితికి తీసుకొచ్చారు. 28 ఓవర్లలో ఇంగ్లండ్‌ రెండు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. ఈ భాగస్వామ్యాన్ని విడగొట్టేందుకు భారత బౌలర్లు శ్రమిస్తున్నారు. రూట్‌ అర్ధశతకం సాధించగా.. మోర్గాన్‌ 45 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు.
     
  • మరోసారి స్పిన్‌ మ్యాజిక్‌ చూపిన కుల్దీప్. 15 ఓవర్‌లో కీలక వికెట్‌ తీశాడు. ఇంగ్లండ్‌ ఓపెనర్‌ జాసన్‌ రాయ్‌(40) ఔట్‌. సిక్స్‌ బార్డర్‌లో క్యాచ్‌ పట్టిన ఉమేష్‌ యాదవ్‌. 15 ఓవర్లలో ఇంగ్లండ్‌ స్కోర్‌ 88/2
  • రంగంలోకి దిగిన చైనామన్‌ కుల్దీప్‌, రెండో బంతికే వికెట్‌. బెయిర్‌ స్టో (38) ఔట్‌
  • పది ఓవర్లలో ఇంగ్లండ్‌​ వికెట్‌ నష్టపోకుండా 69 పరుగులు చేసింది. జాసన్‌ రాయ్‌ 30పరుగులతో, బెయిర్‌ స్టో 38 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.
  • ఆరో ఓవర్లలో ఇంగ్లండ్‌ జట్టు వికెట్‌ కోల్పోకుండా 32 పరుగులు చేసింది.

టీమిండియా: విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, లోకేశ్‌ రాహుల్‌, సురేశ్‌ రైనా, ఎంఎస్‌ ధోని, హార్దిక్‌ పాండ్యా, సిద్దార్థ్‌ కౌల్‌, ఉమేశ్‌ యాదవ్‌, చాహల్‌, కుల్దీప్‌ యాదవ్‌

ఇంగ్లండ్‌: ఇయన్‌ మోర్గాన్‌(కెప్టెన్‌), జాసన్‌ రాయ్‌, బెయిర్‌ స్టో, జో రూట్‌, బెన్‌ స్టోక్స్‌, జాస్‌ బట్లర్‌, మొయిన్‌ అలీ, డేవిడ్‌ విల్లే, లియామ్‌ ప్లంకెట్‌, అదిల్‌ రషీద్‌, మార్క్‌ వుడ్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top