క్యురేటర్ ప్రబీర్ ముఖర్జీ మృతి | curator PrabirMukherjee dead | Sakshi
Sakshi News home page

క్యురేటర్ ప్రబీర్ ముఖర్జీ మృతి

Jun 2 2016 12:38 AM | Updated on Sep 4 2017 1:25 AM

క్యురేటర్ ప్రబీర్ ముఖర్జీ మృతి

క్యురేటర్ ప్రబీర్ ముఖర్జీ మృతి

సుదీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) మాజీ చీఫ్ క్యురేటర్ ప్రబీర్ ముఖర్జీ (86).....

కోల్‌కతా: సుదీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) మాజీ చీఫ్ క్యురేటర్ ప్రబీర్ ముఖర్జీ (86) మంగళవారం రాత్రి మరణించారు. డిప్రెషన్, కాలేయ వ్యాధి కారణంగా ఏప్రిల్ 11 నుంచి ముఖర్జీ నగరంలోని బీఎన్‌ఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఆయన మనవడు ప్రణయ్ ముఖర్జీ తెలిపారు.

1987 ప్రపంచకప్ ఫైనల్‌తో పాటు రెండు దశాబ్దాలు ఈడెన్‌లో పిచ్‌లను తయారు చేయడంలో ప్రబీర్ కీలక పాత్ర పోషించారు. అయితే 2015 అక్టోబరు 8న భారత్, దక్షిణాఫ్రికాల మధ్య టి20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో ఆయన విమర్శలు ఎదుర్కొన్నారు. ఆరు గంటల పాటు సమయం దొరికినా ప్రబీర్ స్టేడియంను సిద్ధం చేయలేకపోయారని సౌరవ్ గంగూలీ విమర్శించడంతో... అప్పటినుంచి ప్రబీర్ ఈడెన్‌లో అడుగుపెట్టలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement