కాంటినెంటల్ జట్టు గెలుపు | Continental Team victory | Sakshi
Sakshi News home page

కాంటినెంటల్ జట్టు గెలుపు

Jan 26 2014 12:25 AM | Updated on Mar 19 2019 9:20 PM

మిధాని బౌలర్ సంతోష్ (5/42) నిప్పులు చెరిగే బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టును బెంబేలెత్తించాడు.

జింఖానా, న్యూస్‌లైన్: మిధాని బౌలర్ సంతోష్ (5/42) నిప్పులు చెరిగే బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టును బెంబేలెత్తించాడు. దీంతో మిధాని జట్టు 6 వికెట్ల తేడాతో ఈసీఐఎల్ జట్టుపై గెలిచింది. ఎ-ఇన్‌స్టిట్యూషన్ వన్డే లీగ్‌లో భాగంగా శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బరిలోకి దిగిన ఈసీఐఎల్ 8 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. రోహిత్ అగర్వాల్ (47) ఫర్వాలేదనిపించాడు. తర్వాత బరిలోకి దిగిన మిధాని నాలుగు వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసి గెలిచింది.
 
 అరుణ్ కుమార్ 31 పరుగులు చేశాడు. ఎ-డివిజన్ వన్డే నాకౌట్ టోర్నీలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో కాంటినెంటల్ జట్టు 8 వికెట్ల తేడాతో గౌడ్స్ ఎలెవన్ జట్టుపై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన గౌడ్స్ ఎలెవన్ 182 పరుగుల వద్ద చేతులెత్తేసింది. సాయినాథ్ (56) అర్ధ సెంచరీతో రాణిం చగా... నాగరాజు (45) మెరుగ్గా ఆడాడు. కాంటినెంటల్ జట్టు బౌలర్ సాత్విక్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బరిలోకి దిగిన కాంటినెంటల్ జట్టు రెండే వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసి నెగ్గింది. శశిధర్ రెడ్డి (75) అర్ధ సెంచరీతో చెలరేగగా... వినీత్ రెడ్డి 42 పరుగులు చేశాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement