భువీ జోడీకి రెడీ... | Bhuvaneshwar Kumar Bowls Over Fans With Picture of 'Better Half' | Sakshi
Sakshi News home page

భువీ జోడీకి రెడీ...

Oct 5 2017 12:53 AM | Updated on Oct 22 2018 6:05 PM

Bhuvaneshwar Kumar Bowls Over Fans With Picture of 'Better Half' - Sakshi

న్యూఢిల్లీ: భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ బ్యాచిలర్‌ లైఫ్‌కి బైబై చెప్పేసి... త్వరలో ఓ ఇంటివాడవుతున్నాడు. అతని ఇంట పెళ్లి బాజా మోగనుంది. ఈ విషయాన్ని అభిమానులతో అతనే స్వయంగా సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు. నుపుర్‌ నాగర్‌తో తనకు వివాహం జరుగనుందని చెప్పేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఫొటోను పోస్ట్‌ చేసిన భువీ ‘ఇదిగో ఈమె నా భాగస్వామి. పేరు నుపుర్‌ నాగర్‌’ అని పేర్కొన్నాడు. సరిగ్గా గత మే 11న తన పెళ్లి ముచ్చటను, పెళ్లి కూతుర్ని త్వరలోనే పోస్ట్‌ చేస్తానని ఇదే ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పేర్కొన్నాడు. అన్నట్లుగానే చెప్పేశాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement