తెలివైనవారిని ఆకర్షించాలి | Best Minds Don't Get Into Badminton Coaching: Pullela Gopichand | Sakshi
Sakshi News home page

తెలివైనవారిని ఆకర్షించాలి

Nov 23 2014 12:36 AM | Updated on Sep 2 2017 4:56 PM

తెలివైనవారిని ఆకర్షించాలి

తెలివైనవారిని ఆకర్షించాలి

భారత బ్యాడ్మింటన్‌లో ప్రస్తుతం నవతరం ఆటగాళ్లు దుమ్మురేపే ఆటతీరుతో దూసుకెళుతున్నారు. కె.శ్రీకాంత్, సైనా, సింధులు తమ అద్భుత ప్రదర్శనతో దేశానికి వన్నె తెస్తున్నారు.

బ్యాడ్మింటన్ కోచ్‌లపై గోపీచంద్

 సాక్షి, హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్‌లో ప్రస్తుతం నవతరం ఆటగాళ్లు దుమ్మురేపే ఆటతీరుతో దూసుకెళుతున్నారు. కె.శ్రీకాంత్, సైనా, సింధులు తమ అద్భుత ప్రదర్శనతో దేశానికి వన్నె తెస్తున్నారు. అయితే భారత్ మున్ముందు మంచి కోచ్‌లను ఆకర్షించకపోతే ప్రపంచ స్థాయి ఆటగాళ్లు రావడం కష్టమవుతుందని జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పి.గోపీచంద్ అభిప్రాయపడ్డారు. ‘భవిష్యత్‌లో సత్తా ఉన్న ఆటగాళ్లు దొరకడం, నాణ్యమైన కోచ్‌లను తెచ్చుకోవడం వంటివి భారత బ్యాడ్మింటన్ ఎదుర్కోబోయే రెండు పెద్ద సమస్యలు.

మౌలిక వసతులు ఏర్పరచుకోవడం సులువే. కానీ అంకితభావం ఉండి పదేళ్ల పాటు నిలకడగా రాణించే ఆటగాళ్లను తయారుచేయడం కష్టం. తెలివైనవారు కోచింగ్ వృత్తిలోకి రావడం లేదు. ముందుగా వారిని ఆకర్షించాలి. గత ఆసియా గేమ్స్‌లో భారత్ దాదాపు 60 పతకాలు గెల్చుకుంది. కానీ ఎంతమంది కోచ్‌ల పేర్లు మనకు తెలుసు?’ అని గోపీచంద్ ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement