బంగ్లాతో మ్యాచ్‌: ఒమన్‌ విజయలక్ష్యం: 181 | Bangladesh sets target to oman 181 runs | Sakshi
Sakshi News home page

బంగ్లాతో మ్యాచ్‌: ఒమన్‌ విజయలక్ష్యం: 181

Mar 13 2016 9:28 PM | Updated on Sep 3 2017 7:40 PM

బంగ్లాతో మ్యాచ్‌: ఒమన్‌ విజయలక్ష్యం: 181

బంగ్లాతో మ్యాచ్‌: ఒమన్‌ విజయలక్ష్యం: 181

టి-20 ప్రపంచ కప్ క్వాలిఫయింగ్ పోటీల్లో భాగంగా గ్రూపు-ఏలో బంగ్లాదేశ్‌, ఒమన్‌ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఒమన్‌ జట్టు తొలుత టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది.

ధర్మశాల: టి-20 ప్రపంచ కప్ క్వాలిఫయింగ్ పోటీల్లో భాగంగా గ్రూపు-ఏలో బంగ్లాదేశ్‌, ఒమన్‌ జట్ల మధ్య ఆదివారమిక్కడ జరుగుతున్న మ్యాచ్‌లో ఒమన్‌ జట్టు తొలుత టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. దాంతో ఒమన్‌ జట్లుకు బంగ్లాదేశ్‌181 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది.

తొలుత ఓపెనర్లుగా బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ ఆటగాళ్లు సౌమ్య సర్కార్‌ 22 బంతుల్లో (రెండు ఫోర్లు)తో 12 పరుగులకే చేతులెత్తేశాడు. షబ్బీర్‌ రహమాన్‌ 26 బంతుల్లో 44 పరుగులు చేసి పెవిలీయన్‌ బాట పట్టాడు. తమీమ్‌ ఇక్బాల్‌ సెంచరీ పూర్తి చేసి103 పరుగులతో అద్భుతంగా రాణించి నాటౌట్‌గా నిలిచాడు. షకీబ్‌ అల్‌ హసన్‌ 17 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. ఒమన్‌ బౌలర్లు లాల్‌చేతా, ఖావర్‌ అలీ తలో వికెట్‌ తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement