బంగ్లాదేశ్‌ 330

Bangladesh Set Target of 331 Runs Against South Africa - Sakshi

లండన్‌: ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ 331 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. సంచనాలకు మారుపేరైన బంగ్లాదేశ్‌ బ్యాటింగ్‌లో ఆకట్టుకోవడంతో సఫారీలకు భారీ స్కోరు నిర్దేశించింది. బంగ్లా ఆటగాళ్లలో సౌమ్య సర్కార్‌(42: 30 బంతుల్లో 9 ఫోర్లు), షకీబుల్‌ హసన్‌(75: 84 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌), ముష్పికర్‌ రహీమ్‌(78: 80 బంతుల్లో 8 ఫోర్లు), మహ్మదుల్లా(46 నాటౌట్‌: 33 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌)లు రాణించచడంతో బంగ్లాదేశ్‌ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 330 పరుగులు చేసింది.  ఇది బంగ్లాకు వరల్డ్‌కప్‌తో పాటు వన్డేల్లో అత్యధిక స్కోరుగా నమోదైంది.
(ఇక్కడ చదవండి: బంగ్లాదేశ్‌ సరికొత్త రికార్డు)

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : 
దక్షిణాఫ్రికా విజయ లక్ష్యం 331

టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాకు 60 పరుగుల వద్ద తొలి వికెట్‌ను నష్టపోయింది. ఓపెనర్‌ తమీమ్‌ ఇక్బాల్‌(16) నిరాశపరిచాడు. అటు తర్వాత సౌమ్య సర్కార్‌- షకీబుల్‌ హసన్‌లు జోడి ఇన్నింగ్స్‌ను పరుగులు పెట్టించింది. సౌమ్య సర్కార్‌ దూకుడుగా ఆడాడు. అయితే ఒక భారీ షాట్‌ ఆడబోయి సౌమ్క సర్కార్‌ వికెట్‌ కోల్పోవడంతో బంగ్లాదేశ్‌ 75 పరుగుల వద్ద రెండో వికెట్‌ను నష్టపోయింది. ఆ తరుణంలో షకీబుల్‌-ముష్పికర్‌ రహీమ్‌ల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. ఈ జోడి 142 పరుగులు భాగస్వామ్యాన్ని సాధించడంతో​ బంగ్లాదేశ్‌ పటిష్ట స్థితికి చేరింది. ఈ క్రమంలోనే వీరిద్దరూ హాఫ్‌ సెంచరీలు సాధించారు. అయితే జట్టు స్కోరు 217 పరుగుల వద్ద షకీబుల్‌ మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. ఆపై కాసేపటికి మహ్మద్‌ మిథున్‌(21) కూడా ఔట్‌ కావడంతో బంగ్లా 242 పరుగులకు నాల్గో వికెట్‌ను కోల్పోయింది. మరో ఎనిమిది పరుగుల వ్యవధిలో రహీమ్‌ కూడా నిష్క్రమించాడు. కాగా, మహ్మదుల్లా-మొసెదెక్‌ హుస్సేన్‌(26) కూడా బ్యాట్‌కు పని చెప్పడంతో బంగ్లా స్కోరులో మళ్లీ వేగం పుంజుకుంది. ప్రధానంగా మహ్మదుల్లా బాధ్యతాయుతంగా ఆడి బంగ్లాదేశ్‌ భారీ స్కోరు చేయడంలో సహకరించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మోరిస్‌, తాహీర్‌, ఫెహ్లుకోవియా తలో రెండు వికెట్లు తీశారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top