
చండీగఢ్: రెజ్లింగ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని వరల్డ్ నెంబర్‌వన్ రెజ్లర్‌గా కొనసాగుతున్న భజరంగ్ పూనియా త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నాడు. తన రంగానికే చెందిన సంగీతా ఫొగట్‌ను వివాహమాడనున్నాడు. ఈ విషయాన్ని గురువారం ఇరువురి కుటుంబసభ్యులు దృవీకరించారు. ఫొగట్ సిస్టర్స్‌లో సంగీత అందరికంటే చిన్నవారన్న సంగతి తెలిసిందే. కాగా, 2020 టోక్యో ఒలింపిక్స్ తర్వాతే వీరి వివాహం జరగనుంది. 'ఇది వారిద్దరు కలిసి తీసుకున్న నిర్ణయమని, పిల్లల అభిప్రాయాలను గౌరవించడమే మా కర్తవ్యమని' సంగీత తండ్రి మహావీర్ సింగ్ ఫొగట్ పేర్కొన్నారు. ప్రస్తుతం రెజ్లింగ్‌లో భజరంగ్ పూనియా 65 కేజీల విభాగంలో, సంగీతా ఫొగట్ 59 కేజీల విభాగంలో పోటీ పడుతున్నారు.