ప్రజ్నేశ్‌ ముందంజ 

Australia Open Grand Slam Tennis Tournament: Pragnesh Enters To Finals - Sakshi

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా ఓపెన్‌ గ్రాండ్‌ స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ పురుషుల మెయిన్‌ ‘డ్రా’కు భారత నంబర్‌వన్‌ టెన్నిస్‌ ఆటగాడు ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ అడుగు దూరంలో నిలిచాడు. ఇక్కడ జరుగుతున్న క్వాలిఫయర్స్‌ టోర్నీలో అతడు ఫైనల్‌కు అర్హత సాధించాడు. గురువారం జరిగిన మ్యాచ్‌లో ప్రజ్నేశ్‌ 1–6, 6–2, 6–2తో యానిక్‌ హంఫ్మాన్‌ (జర్మనీ)పై గెలుపొందాడు.

ఫైనల్‌లో ఎర్నెస్ట్‌ గుల్బిస్‌ (లాత్వియా)తో ప్రజ్నేశ్‌ తలపడతాడు. మరో భారత సింగిల్స్‌ ఆటగాడు సుమీత్‌ నాగల్‌ 6–7 (2/7), 2–6,తో మొహమ్మద్‌ సావత్‌ (ఈజిప్ట్‌) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఇతనితో పాటు ఆస్ట్రేలియా ఓపెన్‌ క్వాలిఫయర్స్‌ బరిలో దిగిన రామ్‌కుమార్‌ రామనాథన్‌ (భారత్‌), మహిళల విభాగంలో అంకిత రైనా (భారత్‌) ఇప్పటికే వెనుదిరిగారు. ఈ నెల 20న ఆస్ట్రేలియా ఓపెన్‌ ఆరంభమవుతుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top