
రోహిత్ శర్మ
దుబాయ్: ఆసియా కప్‌లో అదరగొట్టిన భారత ఓపెనర్లు తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ దూకుడు కనబరిచారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి గైర్హాజరీలో జట్టుకు నాయకత్వం వహించి కప్ అందించిన రోహిత్ శర్మ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు మెరుగు పరుచుకొని తన కెరీర్‌లో అత్యుత్తమంగా రెండో స్థానానికి చేరాడు. ఈ టోర్నీలో 342 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన మరో ఓపెనర్ శిఖర్ ధావన్ నాలుగు స్థానాలు ఎగబాకి ఐదో ర్యాంక్‌లో నిలిచాడు. కోహ్లి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బౌలర్ల విభాగంలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మూడు స్థానాలు ఎగబాకి కెరీర్‌లో తొలిసారి అత్యుత్తమంగా మూడో స్థానానికి వచ్చాడు. అఫ్గానిస్తాన్ స్పిన్నర్ రషీద్‌ఖాన్ ఆల్‌రౌండర్ల జాబితాలో అగ్రస్థానానికి చేరాడు.