సింహం దాడి నుంచి భయటపడ్డ సర్కస్‌ ట్రైనర్‌

In Terrifying Video Circus Lion Attacks Trainer In Ukraine - Sakshi

కియెవ్ : ఉక్రేయిన్‌ సర్కస్‌లో ఓ భయానక సంఘటన చోటు చేసుకుంది. మాస్టర్‌ చెప్పినట్లు ఆడాల్సిన సింహం కాస్తా.. అతని పాలిట మృత్యుదేవతగా మారింది. చచ్చన్రా దేవుడా అనుకున్న సమయంలో అనూహ్యంగా సింహం బారి నుంచి తప్పించుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ప్రముఖ సర్కస్‌ ట్రైనర్‌ హమడా కౌత సర్కస్‌లో ప్రదర్శన నిర్వహిస్తుండగా సింహం ఒక్కసారిగా అతని మీద దాడి చేసింది. అతని కంఠం వద్ద పట్టుకుని.. దాడి చేయడానికి ప్రయత్నించింది. అంతసేపు దీన్ని కూడా సర్కస్‌లో విన్యాసంగానే భావించారు జనాలు. కానీ మ్యూజిక్‌ ఆగిపోయాక భయంతో కేకలు వేస్తోన్న హమడా అరుపులు ప్రేక్షకులకు వినిపించాయి.

కళ్లేదుట జరుగుతున్న దారుణాన్ని చూసి ప్రేక్షకులు కూడా స్థంభించిపోయారు. అదృష్టవశాత్తు హమడా సింహం దాడి నుంచి తప్పించుకోగలిగాడు. ఈ విషయం గురించి అతను మాట్లాడుతూ.. ‘షోలో భాగంగా నేను ఒక సింహాన్ని పిలుస్తుండగా మరో సింహం నా మీద డాడి చేసింది. అది నా మీదకు దూకింది.. కానీ అదృష్టవశాత్తు నా మెడ మీద దాడి చేయలేదు. దేవుడి దయ వల్ల నా కాలు, చేతికి మాత్రమే చిన్న చిన్న గాయాలయ్యాయి. కాకపోతే అప్పటికే నా శరీరం పూర్తిగా రక్తంతో తడిసిపోయింది. ఈ సంఘటన చూసి ప్రేక్షకులు భయంతో కేకలు వేయడం ప్రారంభించారు. నేను వారిని ప్రశాంతంగా ఉండమని కోరాను. ఆ తర్వాత ఎలానో సింహం బారి నుంచి తప్పించుకోగలిగాను. అనంతరం యధావిధిగా ప్రదర్శన నిర్వహించామ’ని చెప్పుకొచ్చారు.

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top