‘చంద్రబాబు బీజేపీకి శాశ్వత మిత్రుడు’

YSRCP MLA Amjad Basha takes on Chandrababu Naidu - Sakshi

అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీజేపీకి శాశ్వత మిత్రుడని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంజాద్‌ బాషా పేర్కొన్నారు. ఆదివారం మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో అనంతపురంలోని పద్మావతి ఫంక్షన్‌ హాల్లో హర్‌ దిల్‌ మే వైఎస్సార్‌ పేరుతో ముస్లిం మైనారిటీల ఆత్మీయ సదస్సు జరిగింది. దీనిలో భాగంగా మాట్లాడిన అంజాద్‌ బాషా.. చంద్రబాబు బీజేపీకి శాశ్వత మిత్రుడు అనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. అదే సమయంలో వైఎస్సార్‌సీపీ సెక్యులర్‌ పార్టీ అని ఆయన స్పష్టం చేశారు. తమ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీతో ఎలాంటి పొత్తులు పెట్టుకోదని పేర్కొన్నారు.

ముస్లింలపై టీడీపీ సర్కార్‌ కక్ష సాధింపుతో వ్యవహరిస్తోందని రిటైర్డ్‌ ఐజీ ఇక్బాల్‌ మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ముస్లింలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ ఆ పార్టీ నెరవేర్చకపోవడమే ఇందుకు ఉదాహరణగా ఆయన తెలిపారు. చంద్రబాబును చూసి ఊసరవెల్లి కూడా సిగ్గు పడుతోందని, రోజుకో పార్టీతో ఆయన పొత్తు పెట్టుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ జాతీయ ప‍్రధాన కార్యదర్శి రెహ్మాన్‌ విమర్శించారు. అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. ముస్లిం ద్రోహి టీడీపీ అని, మైనార్టీలను ఓటు బ్యాంకులా చూడటం సిగ్గు చేటని ఆయన ధ్వజమెత్తారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top