కాంగ్రెస్‌తో పొత్తుకు బాబు ప్రయత్నం

YSRCP Leader MVS Nagireddy Comments On Chandrababu In Amaravati - Sakshi

అమరావతి: కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునేందుకే ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షులు ఎంవీఎస్‌ నాగిరెడ్డి ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ..రాష్ట్రంలో రైతాంగం సంక్షోభాన్ని ఎదుర్కోంటోందని, ప్రకృతి వైపరీత్యం సంభవించినపుడు ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉన్నా కరువు మండలాల ప్రకటన గురించి పట్టించుకోవడం లేదన్నారు.

ఆరు జిల్లాల్లో కరువు, మిగతా జిల్లాల్లో అధిక వర్షాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వ్యాఖ్యానించారు. నాబార్డు నివేదిక ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌ అన్నిరంగాల్లో, ప్రధానంగా రైతాంగం అట్టడుగు స్థాయికి పడిపోయిందని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా ఏరియల్‌ సర్వే చేయడం విడ్డూరంగా ఉందన్నారు. సీఎం చంద్రబాబు, వ్యవసాయశాఖా మంత్రి తప్పుడు నివేదికలను ఇచ్చి మోసగించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top