327వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం | YS Jagan PrajaSankalpaYatra 327th Day Begins | Sakshi
Sakshi News home page

Dec 21 2018 8:43 AM | Updated on Dec 21 2018 9:51 AM

YS Jagan PrajaSankalpaYatra 327th Day Begins - Sakshi

జననేత 327వ రోజు పాదయాత్రను టెక్కలి నియోజకవర్గంలోని సంతబొమ్మాళి మండలం దండుగోపాలపురం నుంచి ప్రారంభించారు.

సాక్షి, శ్రీకాకుళం: ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత 327వ రోజు పాదయాత్రను శుక్రవారం ఉదయం టెక్కలి నియోజకవర్గంలోని సంతబొమ్మాళి మండలం దండుగోపాలపురం నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి కాశీపురం మీదుగా దామోదరపురం క్రాస్‌ వరకు పాదయాత్ర కొనసాగనుంది.

అడుగు ముందుకు పడనీయని అభిమానం, కాలు కదపనీయని అనురాగం, దారి పొడవునా మంగళహారతులు, ప్రజా సమస్యలపై వినతులు, విజ్ఞప్తులతో జననేత పాదయాత్ర ముందుకు కదులుతోంది. రాజన్న తనయున్ని చూడటానికి, మాట్లాడటానికి, పాదయాత్రలో తాము భాగం కావాలని ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున తరలివస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement