నేడు ఎంపీలతో వైఎస్‌ జగన్‌ భేటీ  | YS Jagan Mohan Reddy Will Held Meeting With YSRCP MPS | Sakshi
Sakshi News home page

నేడు ఎంపీలతో వైఎస్‌ జగన్‌ భేటీ 

Mar 26 2018 12:58 AM | Updated on Mar 23 2019 9:10 PM

YS Jagan Mohan Reddy Will Held Meeting With YSRCP MPS - Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు పార్టీ ఎంపీలతో భేటీ కానున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్‌పై కొద్ది రోజులుగా పార్లమెంట్‌లో ఎంపీలు పోరాటం చేస్తుండటం, ఎన్డీయే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇవ్వడం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్లమెంటులో తదుపరి అనుసరించాల్సిన వ్యూహంపై ప్రజా సంకల్ప యాత్రలో తాను విడిది చేసిన శిబిరం వద్ద సోమవారం వైఎస్‌ జగన్‌ పార్టీ ఎంపీలతో సమావేశమవుతారు.

గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని ముప్పాళ్ల గ్రామంలో ఈ భేటీ జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ భేటీలో ప్రధానంగా ప్రత్యేక హోదా డిమాండ్‌ను మరింత ఉధృతం చేయడం, హోదాకు వివిధ పార్టీల మద్దతు కూడగట్టడం, పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన ఎంపీలకు సలహాలు, సూచనలివ్వనున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement