జనసేనానిపై ఎంపీ విజయసాయి రెడ్డి ఫైర్‌! | Vijaya sai Reddys Twitter Platform Once Again Criticizes Pawan Kalyan | Sakshi
Sakshi News home page

జనసేనానిపై ఎంపీ విజయసాయి రెడ్డి ఫైర్‌!

Nov 27 2019 11:21 AM | Updated on Nov 27 2019 12:53 PM

Vijaya sai Reddys Twitter Platform Once Again Criticizes Pawan Kalyan - Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌పై మరోసారి విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పై ప్యాకేజీ స్టార్ విషం కక్కుతున్నారని మండిపడ్డారు. కాల్షీట్లు అయిపోవస్తున్నా ఆయనకు ప్రజల నుంచి కనీస స్పందన  రావడం లేదని ఎద్దేవా చేశారు. కుటుంబ పిడికిలి అంటూ కొత్త రాగాన్ని అందుకున్నారని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబంలో ముగ్గురు పదవుల్లో ఉన్నారని తెలిపారు. మీ అన్న నాగబాబుకు మీరు ఎంపీ టికెట్ ఇవ్వలేదా? అని పవన్ ను ప్రశ్నించారు. గురివింద గింజలా నీతులు చెప్పొద్దని వ్యాఖ్యానించారు.

Advertisement
 
Advertisement
Advertisement