‘ఆ విషయం బాబు చెవిలో చెప్పారట’

Vijay Sai Reddy Critics Chandrababu Comments On AP Capital - Sakshi

ట్విటర్‌ వేదికగా విజయసాయిరెడ్డి విమర్శలు

సాక్షి, హైదరాబాద్‌ : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబుపై ట్విటర్‌ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘ప్రధానులను డిసైడ్ చేశాను. రాష్ట్రపతులను సెలెక్ట్ చేశానని డప్పుకొట్టుకునే వ్యక్తి ఇన్ సైడర్ భూములు కాపాడుకునేందుకు దిగజారి మాట్లాడుతున్నాడు. ఉత్తరాంధ్ర ప్రజలు వైజాగ్ లో ఎగ్జిక్యూటివ్ రాజధాని కోరుకోవడం లేదట. కర్నూలు వాళ్లు జ్యుడీషియల్ క్యాపిటల్ వద్దేవద్దని ఈయన చెవిలో చెప్పారట’అని పేర్కొన్నారు.
(చదవండి : ‘చంద్రబాబు రాష్ట్రంలో​ పుట్టడం దురదృష్టకరం’)

ఇక మరో ట్వీట్‌లో టీడీపీ నేత లోకేష్‌ బాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశించి విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ‘ఉత్త పుత్రుడు, దత్తపుత్రుడు పచ్చ మీడియా అనే ‘కీలు గుర్రం’ ఎక్కి స్వారీ చేస్తున్నారు. రివ్వున ఎగిరినట్టు కలల్లో తేలిపోతున్నారు. పరమ  అవమానకరంగా పరాజయం పాలై ఆరు నెలలు తిరగక ముందే చిటెకలు వేస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. ఎవరైనా చెప్పండయ్యా. వెకిలి చేష్టలతో పరువు తీసుకోవద్దని’అని పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top