అప్పుడాయన పొగిడారు కానీ.. ఇప్పుడైతేనా? | Vajpayee was agitated after Nehru's picture went missing | Sakshi
Sakshi News home page

అప్పుడాయన పొగిడారు కానీ.. ఇప్పుడైతేనా?

Aug 17 2018 5:06 AM | Updated on Aug 17 2018 5:06 AM

Vajpayee was agitated after Nehru's picture went missing - Sakshi

న్యూఢిల్లీ: అది 70వ దశకం. అటల్‌జీ విదేశాంగ మంత్రిగా ఉన్నారు. ఢిల్లీలోని సౌత్‌ బ్లాక్‌లో నెహ్రూ చిత్రపటం కనబడలేదు. వెంటనే కల్పించుకున్న అటల్‌.. దాన్ని అక్కడే తిరిగి పెట్టాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ విషయాన్ని పార్లమెంటు భేటీలోనూ ప్రస్తావించారు. ‘కాంగ్రెస్‌ మిత్రులు ఇది నమ్మకపోవచ్చు. సౌత్‌ బ్లాక్‌లో నేను వెళ్లే దారిలో నెహ్రూ చిత్రపటం ఉండేది. కానీ అకస్మాత్తుగా అది కనబడకుండా పోయింది’ అంటూ సభలో ప్రస్తావిం చారు. ‘సిబ్బందిని అడిగాను. ఆ పటం ఏదని. వారి నుంచి సమాధానం రాలేదు. తర్వాత మళ్లీ దాన్ని ఆ స్థానంలోనే పెట్టారు’ అన్నారు. దీంతో సభ ఒక్కసారిగా చప్పట్లతో మారుమోగింది. ఇతరుల విమర్శలనూ స్వీకరించే గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తి నెహ్రూ అంటూ పొగిడారు అటల్‌జీ. ‘విన్‌స్టన్‌ చర్చిల్, నెవిలే చాంబర్లీన్‌ల వ్యక్తిత్వాలు కలబోసిన వ్యక్తి నెహ్రూజీ అని ఓ సారి విమర్శించాను. దానికి ఆయన ఏమాత్రం కలత చెందలేదు. సాయంత్రం ఆయన్ను కలసినపుడు చాలా బాగా మాట్లాడావని పొగిడారు. ఇప్పుడలాంటి విమర్శలు చేస్తే నాతో మాట్లాడటమే మానేస్తారు’ అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement