‘2019లో మోదీకి భంగపాటు తప్పదు’ | Under United Opposition,Even Narendra Modi May Lose Varanasi In 2019  | Sakshi
Sakshi News home page

‘2019లో మోదీకి భంగపాటు తప్పదు’

Apr 8 2018 6:00 PM | Updated on Aug 15 2018 2:37 PM

Under United Opposition,Even Narendra Modi May Lose Varanasi In 2019  - Sakshi

ఫైల్‌ఫోటో

సాక్షి, బెంగళూర్‌ : 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు ఎదురవుతుందని, ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి లోక్‌సభ స్ధానం నుంచి ఓటమిపాలవుతారని కాం‍గ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ అన్నారు. ఎస్‌పీ, బీఎస్‌పీలు బీజేపీకి వ్యతిరేకంగా ఏకమవడంతో మోదీకి షాక్‌ తప్పదని స్పష్టం చేశారు. విపక్షాలు తమ సిద్ధాంత వైరుధ్యాలను పక్కనపెట్టి బీజేపీకి వ్యతిరేకంగా సంఘటితమవుతున్నాయని చెప్పుకొచ్చారు. ‘రానున్న ఎన్నికల్లో బీజేపీ గెలిచే అవకాశం ఎంత మాత్రం లేదు..తాము తిరిగి మునుపటి స్ధాయికి చేరుకుంటా’మని రాహుల్‌ ధీమా వ్యక్తం చేశారు.

విపక్షాల ఐక్యత నిర్ధిష్టస్ధాయికి చేరిందని, దీంతో బీజేపీ విజయావకాశాలు సన్నగిల్లాయని మీడియాతో చిట్‌చాట్‌ సందర్భంగా రాహుల్‌ విశ్లేషించారు. యూపీ, బీహార్‌, బెంగాల్‌ సహా పలు రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు జట్టుకడుతున్నాయని చెప్పుకొచ్చారు. విపక్షాల మధ్య సిద్ధాంత వైరుధ్యాలు, నాయకత్వ విభేదాల వంటి సమస్యలను అధిగమిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.మోదీ, బీజేపీ ప్రజా విశ్వాసాన్ని కోల్పోతున్నాయని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement