స్పీకర్‌ తమ్మినేనిపై టీడీపీ దుర్భాషలు | TDP abuses on AP Assembly Speaker Thammineni Sitaram | Sakshi
Sakshi News home page

స్పీకర్‌ తమ్మినేనిపై టీడీపీ దుర్భాషలు

Nov 12 2019 3:34 AM | Updated on Nov 12 2019 3:34 AM

TDP abuses on AP Assembly Speaker Thammineni Sitaram - Sakshi

స్పీకర్‌ తమ్మినేని సీతారాంను తీవ్రంగా దూషిస్తూ సోమవారం తమ అధికారిక ఈ–పేపర్‌లో టీడీపీ ప్రచురించిన కథనం

సాక్షి, అమరావతి: అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాంపై టీడీపీ వ్యక్తిగత దూషణలకు దిగింది. మాటల్లో చెప్పలేని.. రాయలేని భాషలో ఆయనను దారుణంగా తూలనాడుతూ టీడీపీ అధికారిక ఈ–పేపర్‌లో కథనం ప్రచురించింది. అందులో స్పీకర్‌ను ‘దున్నపోతు, ఆంబోతు’ అంటూ ఇష్టారాజ్యంగా చెలరేగిపోయింది. శాసనసభ స్పీకర్‌కు కనీస గౌరవం కూడా ఇవ్వకుండా దారుణ పదాలతో దూషణలకు పాల్పడింది. ‘దున్నపోతులా సాంబార్‌ తాగొచ్చి అసెంబ్లీలో నిద్రపోతాడు.. జనం ముందు బయటకు వచ్చి ఆంబోతులా రంకెలేస్తుంటాడు.. నీది కూడా ఒక బ్రతుకేనా’ అంటూ నీచత్వానికి ఒడిగట్టింది.

Advertisement
 
Advertisement
Advertisement