వారికి పుట్టగతులు లేకుండా చేస్తాం: తలసాని | Talasani Srinivas Yadav Fires On Jaipal Reddy | Sakshi
Sakshi News home page

వారికి పుట్టగతులు లేకుండా చేస్తాం: తలసాని

Apr 9 2018 6:40 PM | Updated on Mar 18 2019 9:02 PM

Talasani Srinivas Yadav Fires On Jaipal Reddy - Sakshi

తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

సాక్షి, మహబూబ్‌నగర్‌ : కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు జైపాల్‌ రెడ్డి, డీకే అరుణకు మహబుబ్‌నగర్‌లో పుట్టగతులు లేకుండా చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. ఇక్కడి నుంచి గెలిచి, ఒక్క పని చేయకుండా ఎన్నికల కోసం మళ్లీ వచ్చి పేదలకు మాయమాటలు చెప్పి మోసం చేయాలకుంటున్నారని విమర్శించారు. సోమవారం జిల్లాలోని హన్వాడలో గొర్రెల దాణా పంపిణీ కార్యక్రమంలో మంత్రి తలసాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహబూబ్‌ నగర్‌లో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.

సబ్సిడీపై ఇచ్చిన గొర్రెలు చనిపోతే ఐదు రోజుల్లో మరో గొర్రెను ఇస్తామని తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి చేస్తున్నట్టు తెలిపారు. పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తయితే పాత జిల్లా సస్యశ్యామలం అవుతుందని, కానీ అలా జరగకుండా కాంగ్రెస్‌ నాయకులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. జిల్లా వ్యాప్తంగా బస్సు యాత్రలు, పాదయాత్రలు చేపట్టి వారికి తగిన గుణపాఠం చెప్తామన్నారు. ఏనాడు ప్రజల కోసం పనిచేయని వారు ఇప్పుడు కాగ్‌ నివేదిక గురించి మాట్లాడటం విడ్డురంగా ఉందని మండిపడ్డారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement