‘ఓటేయ్యండి.. బాండ్‌ రాసిస్తా’

Sarpanch Candidate Distribute Bond Papers Asked Cast Vote For Her - Sakshi

బాండ్‌ పేపర్లను పంచి ఓట్లు అడిగిన సర్పంచ్‌ అభ్యర్థి 

సాక్షి, నల్లగొండ : ‘నన్ను సర్పంచ్‌గా గెలిపిస్తే మీ దగ్గరినుంచి రూపాయి ఆశించను. ఇప్పుడు ఉన్న ఆస్తికంటే ఎక్కువ సంపాదిస్తే జప్తు చేసి ప్రజలకు పంచండి’అంటూ ఓ సర్పంచ్‌ అభ్యర్థి వంద రూపాయల బాండ్‌ పేపర్‌పై సంతకం చేసి ప్రజలకు పంచుతూ ఓట్లను అభ్యర్థించాడు. నల్లగొండ జిల్లా కట్టంగూర్‌ మండలం చెర్వుఅన్నారం గ్రామ సర్పంచ్‌ అభ్యర్థిగా సీపీఎం మద్దతుతో చిలుముల రమణ రామస్వామి బరిలో నిలిచారు. తనని సర్పంచ్‌గా గెలిపించాలని కోరుతూ మంగళవారం రూ.100 బాండ్‌ పేపర్‌ జిరాక్స్‌ ప్రతులను ఇంటింటికి పంపిణీ చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top