బాబు పాలనలో పెరిగిన అఘాయిత్యాలు | Rapes Raise In The Reign Of Chandra Babu Naidu Said By YSRCP MP Vara Prasad | Sakshi
Sakshi News home page

బాబు పాలనలో పెరిగిన అఘాయిత్యాలు

May 6 2018 11:57 AM | Updated on Aug 29 2018 3:33 PM

Rapes Raise In The Reign Of Chandra Babu Naidu Said By YSRCP MP Vara Prasad - Sakshi

ఎంపీ వరప్రసాద్‌

సాక్షి, తిరుపతి : ఆంధ్రప్రదేశ్‌లో సీఎం నారా చంద్రబాబు నాయుడి పాలనలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయని ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వరప్రసాద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం తిరుపతిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అమాయక బాలికలు, మహిళల మీద దాడులు జరుగుతున్నా చంద్రబాబు సర్కారు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. దాచేపల్లి లాంటి ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

దాచేపల్లి ఘటన నిందితుడు టీడీపీలో క్రియాశీలక వ్యక్తి అని, అధికారం ఉందనే అండతోనే టీడీపీ కార్యకర్తలు దారుణాలు పాల్పడుతున్నారని విమర్శించారు. మహిళల రక్షణ కోసం కఠిన చట్టాలు ఉన్నా అమలు కావడం లేదని తెలిపారు. గత మూడేళ్లలో 2 వేల మంది మీద అత్యాచారాలు జరిగాయని,  అయినా కూడా 15 మందికి మాత్రమే శిక్ష పడిందని గుర్తు చేశారు. ప్రభుత్వ వ్యవస్థలను చంద్రబాబు సర్వ నాశనం చేశారని ధ్వజమెత్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement