విపక్షాల సమావేశానికి రాహుల్‌ డుమ్మా 

Rahul gandhi Not To Attend The Opposition Parties Meeting In Delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల తర్వాత విపక్షపార్టీలు ఢీలా పడినట్టు కనిపిస్తున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి మరోసారి గెలుస్తుందని ఎగ్జిట్స్‌ పోల్స్‌ ఫలితాలు ప్రకటించడంతో హస్తినలో రాజకీయా సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. విపక్షపార్టీల మధ్య దూరం పెరిగిపోయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా మంగళవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన విపక్షాల సమావేశానికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ రాకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 

సార్వత్రిక ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రవర్తించిన తీరు, 50 శాతం వీవీప్యాట్‌ల లెక్కింపుపై చర్చించేందుకు మంగళవారం స్థానిక కాన్స్టిట్యూషన్‌ క్లబ్‌లో విపక్షాల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం అనంతరం మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవాలని నేతలు అభిప్రాయపడ్డారు. అయితే రాహుల్‌, పశ్చిమబెంగాల్‌, కర్ణాటక సీఎంలు మమతా బెనర్జీ, కుమారస్వామి, యూపీ ఆగ్రనాయకులు అఖిలేష్‌ యాదవ్‌, మాయావతి‌ ఎన్సీపీ అధ్యక్షుడు శరదపవార్‌లు సమావేశానికి హాజరుకాకపోవడం గమనార్హం. కాగా, ఈ కార్యక్రమానికి వివిధ పార్టీల అధినేతలు తమ పార్టీల ప్రతినిధులను పంపించారు. ఈ సమావేశానికి అజాద్‌, అహ్మద్‌ పటేల్‌(కాంగ్రెస్‌), సీతారం ఏచూరి(సీపీఎం), కనిమొళి(డీఎంకే), సుధాకర్‌ రెడ్డి, డి. రాజా(సీపీఐ), రాంగోపాల్‌ యాదవ్‌(ఎస్పీ), కేజ్రీవాల్‌(ఆప్‌)లు హాజరయ్యారు.   

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : 
ముగిసిన విపక్షాల భేటీ వివిధ పార్టీల అధినేతలు డూమ్మ

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top